హీరో వరుణ్ సందేశ్ సతీమణి వితిక షేర్ ఇటీవల ఒక అనాథ శరణాలయాన్ని సందర్శించి అనాథ బాల , బాలిక లకు క్రిస్మస్ గిఫ్ట్ ఏమి కావాలని అడగగా సమీర్ అనే బాలుడు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కావాలని కోరాడు. క్రిస్మస్ కు ఆ అనాథ బాలుడు కోర్కె ను తీర్చాలనీ , సమీర్ మీ ఫ్యాన్ అనీ , మీ ఆటోగ్రాఫ్ కోరుతున్నాడనీ వితిక , అల్లు అర్జున్ ను సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ రిక్వెస్ట్ కు అల్లు అర్జున్ స్పందించి తన తనయుడు అయాన్ ద్వారా తన ఆటోగ్రాఫ్ ను సమీర్ కు అందజేసి శాంటా గా మారారు. అయాన్ అనాధశరణాలయానికి చేరుకొని తన తండ్రి (అల్లు అర్జున్ ) ఆటోగ్రాఫ్ ను , ఒక బ్యాడ్మింటన్ రాకెట్ ను సమీర్ కు అందజేసారు. దాంతో ఆ అనాథ శరణాలయంలో ఉన్న బాల , బాలికలు కేరింతలు కొడుతూ అల్లు అర్జున్ కు థ్యాంక్స్ చెప్పారు. క్రిస్మస్ రోజున అల్లు అర్జున్ శాంటా గా మారి తన చిన్నారి అభిమాని సమీర్ ను సర్ ప్రైజ్ చేశారు. తన కూడా అయాన్ ను అనాధశరణాలయానికి పంపినందుకు వితిక థ్యాంక్స్ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























