సింగర్ సునీత త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని తో ఇటీవలే సునీత నిశ్చితార్థం జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే చాలా సింపుల్ గా నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే ప్రీ వెడ్డింగ్ పార్టీ ఒకటి కూడా జరిగింది. నితిన్ ఆర్గనైజ్ చేసిన ఈ పార్టీకి ఇండస్ట్రీకి చెందిన అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందింది. రేణుదేశాయ్,సుమ కనకాల వంటి సెలబ్రిటీలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇక నేడు మరో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. నిజానికి వీరి పెళ్లి డిసెంబర్‌లో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఇప్పుడు 2021 జనవరి 9వ తేదీన పెళ్ళికి ముహూర్తం పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారట. కరోనా నేపథ్యంలో పెళ్ళికి కూడా అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది.
సునీత ఉపద్రష్ట.. పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సునీత వైవాహిక జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే . చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకోగా వ్యక్తిగత కారణాల వల్ల తన భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు సునీత. ఇక తనకు ఇద్దరు పిల్లలు ఉండగా.. వారితోనే ఉంటుంది సునీత.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: