క్రిస్మస్ పండుగ సందర్భంగా థియేటర్స్ లో మొదట రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మంచి టాక్ తో.. సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సోలోగా వచ్చినా సాలిడ్ హిట్ కొట్టాడన్న ప్రశంసలు దక్కించుకుంటున్నాడు సాయి తేజ్. ఇక ఇదే ధైర్యంతో చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. వచ్చే సంక్రాంతికి చాలా సినిమాలు క్యూ లో ఉన్నాయి. ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులు ఎంత వెయిట్ చేస్తున్నారో.. తెలుగు అభిమానులు కూడా అంతే ఆకస్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ముందు నుండి అనుకుంటున్నట్టే ఈ సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జనవరి 13న అన్ని భాషలలో విడుదల కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Aana aavanna apna time na
Vanganna vanakkamnaIni #VaathiRaid na! 🔥#Vaathicoming to theatres near you on January 13. #Master #மாஸ்டர்#మాస్టర్#VijayTheMaster #MasterPongal #MasterOnJan13th pic.twitter.com/RfBqIhT95U
— XB Film Creators (@XBFilmCreators) December 29, 2020
కాగా ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: