కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 29

సినిమా వార్తలు

రాఘవ లారెన్స్ న్యూ మూవీ టైటిల్

డ్యాన్సర్ గా పలు తమిళ , తెలుగు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రాఘవ లారెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ మూవీస్ కు పనిచేసిన లారెన్స్ "అన్నయ్య ", "ఇంద్ర ", "స్టైల్ " వంటి మూవీస్ కు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. "అర్పుతం "తమిళ మూవీ తో లారెన్స్ హీరోగా మారారు. సూపర్ హిట్ "ముని "మూవీ తో లారెన్స్ హీరోగా సెటిల్ అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో సిద్ధార్ధ్ కమ్ బ్యాక్ మూవీ "మహాసముద్రం"

సూపర్ హిట్ చిత్ర దర్శకుడి శంకర్ ఎస్ దర్శకత్వంలో రూపొందిన "బాయ్స్ "మూవీ తో సిద్ధార్ధ్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా "మూవీ తో సిద్ధార్ధ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సిద్ధార్ధ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "బొమ్మరిల్లు ", "జబర్దస్త్ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో సిద్ధార్ధ్ ప్రేక్షకులను అలరించారు. "రంగ్ దే బసంతి ", "ఛష్మే బద్దూర్ "సూపర్ హిట్ హిందీ మూవీస్ లో నటించిన సిద్ధార్ధ్ కోలీవుడ్ లో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరో చిన్నారి ప్రాణానికి అండగా నిలిచిన మహేష్ దంపతులు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా వా కార్యక్రమాలు చేసినా పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. అలాగే నిరు పేద‌ల‌కి ఆయన అండ‌గా ఉంటున్నాడు . ఇక చిన్న పిల్లలకు అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయి చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి మరో చిన్నారి ప్రాణానికి అండగా నిలిచారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మృణాళిని రవికి భారీ మూవీ ఆఫర్

ఇంజనీర్ అయిన మృణాళిని రవి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ చేస్తూ , ఫ్రీ టైమ్ లో టిక్ టాక్ &డబ్ స్మాష్ వీడియోస్ ను రూపొందించేవారు. సూపర్ హిట్ "సూపర్ డీలక్స్ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన మృణాళిని రవి , "ఛాంపియన్ " మూవీ లో హీరోయిన్ గా నటించారు. సూపర్ హిట్ "గద్దలకొండ గణేష్ " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. మృణాళిని ప్రస్తుతం "ఎమ్ జి ఆర్ మగన్ ", "జాంగో ", "కోబ్రా ", "పొగరు "(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. మృణాళిని ఇప్పుడు ఒక భారీ మూవీ ఆఫర్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - నాగ్ ఈజ్ బ్యాక్

బిగ్ బాస్ 4- ఈరోజు వీకెండ్.. అందరూ రోజూ బిగ్ బాస్ చూస్తారో లేదో తెలియదు కానీ.. ఈ రోజు మాత్రం రోజూ చూడని వాళ్ళు కూడా చూస్తుంటారు. ఎందుకంటే హోస్ట్ రావడం.. హౌస్ మేట్స్ ఏమైనా తప్పులు చేస్తే వారికి క్లాసులు పీకడం.. ఎవరెవరికి ఎలాంటి ఇష్యూస్ ఉంటే వాటికి క్లారిటీ ఇవ్వడం వంటివి చేస్తుంటారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం ఎపిసోడ్ కోసం కూడా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం ఎవరు హోస్ట్ గా వస్తారన్న దానిపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. ఎందుకంటే నాగార్జున షూటింగ్ కోసం మనాలి వెళ్లడమే కారణం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కాజల్ కు "మోసగాళ్ళు "టీమ్ స్పెషల్ విషెస్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు " మూవీ రూపొందుతుంది. సునీల్ శెట్టి , నవదీప్ , నవీన్ చంద్ర , రూహి సింగ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Actress Aishwarya Rajesh Replaces Nivetha Pethuraj In SDT14
సినిమా వార్తలు

#SDT14 - నివేత ప్లేస్ లో ఐశ్వర్యా రాజేష్

దేవా కట్టా దర్సకత్వంలో సాయి తేజ్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు సాయి తేజ్, దేవ కట్టా. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు.

TFN Adminవాట్సాప్
Bigg Boss 4 Team Gives A Glimpse Of 55 Days Of Their Journey To The House Mates
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - 55 రోజుల జర్నీ

బిగ్ బాస్ సీజన్ 4- చూస్తుండగానే 55 రోజులు పూర్తయింది. ప్రస్తుతానికి హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 15 మంది స‌భ్యుల‌తో ప్రారంభ‌మైన ఈ రియాలిటీ షోకు ముగ్గురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తం 18 మంది స‌భ్యుల‌తో బిగ్ బాస్ సీజన్ 4 కొనసాగుతుంది. ఇక ఈ 55 రోజుల్లో ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. మరోవైపు నిన్న ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు 55రోజుల జర్నీ చూపించి కాస్త ఎమోషనల్ చేశారు.

TFN Adminవాట్సాప్
Suriya's Aakaasam Nee Haddhu Ra New Poster Out Now
ఫస్ట్ లుక్

"ఆకాశం నీ హద్దురా " న్యూ మోషన్ పోస్టర్ రిలీజ్

2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి ఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా " సూరరై పోట్రు "(ఆకాశం నీ హద్దురా ) మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన కాజల్ అగర్వాల్ పెళ్లి

మొత్తానికి టాలీవుడ్ లో ఒక్కొక్కరూ ఒక్కో ఇంటివారవుతున్నారు. 2020 సినిమాలకు కలిసిరాకపోయినా హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకుల పెళ్లిళ్లకు మాత్రం కలిసొచ్చింది. ఏ ఏడాది జరగనట్టుగా ఈ ఏడాది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరిగాయి. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ వివాహాలు అవ్వగా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు ఏలిన కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్.

TFN Adminవాట్సాప్
Gunasekhar About Shaakuntalam Greatness
సినిమా వార్తలు

"శాకుంతలమ్ "గొప్పదనం - గుణ శేఖర్

దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో బాల నటీనటులతో తెరకెక్కిన "రామాయణం "మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. "చూడాలని ఉంది ", "ఒక్కడు ", "రుద్రమదేవి "వంటి సూపర్ హిట్ మూవీస్ తో దర్శకుడు గుణశేఖర్ ప్రేక్షకులను అలరించారు. గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో "హిరణ్య కశ్యప "మూవీ రుపొందాల్సి ఉండగా , గుణశేఖర్ "శాకుంతలమ్ "మూవీ ని అనౌన్స్ చేశారు.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4-జంట‌లుగా విడిపోయిన హౌజ్‌మేట్స్

బిగ్ బాస్ 4- 54వ రోజు.. నోయల్ బయటికి వెళ్లిపోవడంతో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చారని.. కాన్ఫెషన్ రూమ్ లో ఉన్నారని.. అరియానా కెప్టెన్ కావడంతో వెళ్లి తీసుకురావాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. దీనితో అందరూ షాకయ్యారు.. వచ్చేది ఎవరబ్బా అని ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అరియానా రెండు రోజులు క్రితం చేసిన రిక్వెస్ట్ కు ఇప్పుడు ఆ డాల్ ను పంపించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈ వారం ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్ డేట్స్ మిస్ అవ్వకండి

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దీపావళి కానుకగా "ఆకాశం నీ హద్దురా "

తమిళ స్టార్ హీరో సూర్యకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అధిక ఫాలోయింగ్ ఉంది. హీరో సూర్య నటించిన ప్రతీ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. " గజిని" , "యముడు" వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో సూర్య తెలుగు ప్రేక్షకులను అలరించారు. హీరో సూర్య ఇప్పుడు "ఆకాశం నీ హద్దురా " మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'ఓదెల రైల్వేస్టేష‌న్' సెకండ్ షెడ్యూల్ స్టార్ట్

అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా 'ఓదెల రైల్వేస్టేష‌న్'. ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్స్ అందించిన శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ ప్రొడ‌క్ష‌న్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ మొద‌టి షెడ్యూల్ పూర్తిచేసింది చిత్ర యూనిట్‌.మొద‌టి షెడ్యూల్‌లో కొన్ని సీన్లను ఓదెల ర్వైల్వేస్టేషన్లో చిత్రీకరించగా మరికొన్ని సన్నివేశాలను ఓదెల మండలంలో తెర‌కెక్కించారట.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాకు రెడీ అవుతున్నాడు. అందరూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గోన గన్నారెడ్డి పాత్రలో బాలకృష్ణ ?

సాంఘిక , జానపద , పౌరాణిక , చారిత్రాత్మక ఏ జానర్ మూవీలో నైనా తన పాత్రను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో బాలకృష్ణ "దానవీర శూర కర్ణ " మూవీ లో అభిమన్యుడు , "బ్రహ్మర్షి విశ్వామిత్ర" లో హరిశ్చంద్రుడు , "ఆదిత్య 369 "లో కృష్ణదేవరాయలు , "భైరవ ద్వీపం "లో రాజ వంశస్థుడు , "శ్రీకృష్ణ విజయం" లో కృష్ణుడు , అర్జునుడు , "శ్రీరామ రాజ్యం "లో శ్రీరాముడు , "గౌతమి పుత్ర శాతకర్ణి "లో శాతకర్ణి గా ప్రేక్షకులను అలరించారు. హీరో బాలకృష్ణ ఇప్పుడు కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమ దేవి కాలం నాటి వర్ధమానపురం ను పరిపాలించిన గోన గన్నారెడ్డి పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ రిలీజ్

పలాస 1978 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ క‌రుణ కుమార్. ఈ సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం దక్కించుకున్నాడు. ఇప్పుడు సుధీర్ బాబు.. కరుణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ను ఇప్పటికే విడుదల చేయగా తాజాగా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'శ్రీదేవి సోడా సెంటర్' లో అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు లైటింగ్ సూరి బాబు అనే పాత్రలో నటిస్తున్నాడు. మోష‌న్ పోస్ట‌ర్‌లో సుధీర్ బాబు సోడా ప‌ట్టుకొని ఉన్న స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. డెక‌రేష‌న్ లైట్స్‌, సోడా బాటిల్స్‌, మ‌ల్లె పూలు క‌నిపిస్తుండ‌గా…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఇటలీ మీడియా లో ప్రభాస్

బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2 "మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దేశ , విదేశాలలో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. రష్యా , చైనా , జపాన్ వంటి దేశాలలో హీరో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిన ప్రభాస్ మూవీస్ కై అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్నారు. "రాధేశ్యామ్ "మూవీ తరువాత రెండు భారీ చిత్రాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'కపటధారి' టీజర్ రీలీజ్

సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు.

TFN Adminవాట్సాప్

షేర్