ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 30

సైకలాజికల్ థ్రిల్లర్ 'గతం' ట్రైలర్ రిలీజ్
నభా నటేష్ ట్రెడిషినల్ లుక్

పోల్ గేమ్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ బెస్ట్ మూవీ ?

"BB3"మూవీ షూటింగ్ పునః ప్రారంభం
"నాంది "మూవీ షూటింగ్ పూర్తి
మాస్ లుక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
పవన్ కళ్యాణ్ కు జోడీగా సాయి పల్లవి ?
"RRR" మూవీ షూటింగ్ లో అలియాభట్ ఎంట్రీ
చిరంజీవి రెడీ ఫర్ షూటింగ్
మహేష్ మీసం లుక్ పై నమ్రత రియాక్షన్
మరో ఛాలెంజింగ్ రోల్ లో నాని
మిస్ కాజల్ అగర్వాల్ గా ఇంకా రెండు రోజులే
మెగా స్టార్ చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ ?
వెబ్ సిరీస్ లో సాయి పల్లవి
నాగశౌర్య - అనీష్ కృష్ణ సినిమా లాంచ్
రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ
యాక్షన్ సీన్స్ లో నాగార్జున
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరో గా వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ "వైల్డ్ డాగ్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దియా మీర్జా , సయామీ ఖేర్ కథానాయికలు. హీరో నాగార్జున ఎన్ఐఎ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో అతుల్ కులకర్ణి , అలీ రెజా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు "వైల్డ్ డాగ్" మూవీ 70శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది.

సైకలాజికల్ థ్రిల్లర్ 'గతం' ట్రైలర్ రిలీజ్
కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె , పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గతం'. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాను మొత్తం అమెరికాలోనే మూడు నెలలపాటు షూటింగ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిన్ననే ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ గా.. మిస్టరీ గా ఉందని ప్రశంసిస్తూ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించాడు సత్యదేవ్.
నభా నటేష్ ట్రెడిషినల్ లుక్
సక్సెస్ ఫుల్ "వజ్రకాయ "(2015 ) కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన మోడల్ , భరతనాట్య డ్యాన్సర్ నభా నటేష్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. "నన్ను దోచుకుందువటే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ , బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్న నభా కథానాయికగా నటించిన "సోలో బ్రతుకే సో బెటర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
'పవన్' రీమేక్ లో 'ఫిదా' బ్యూటీ - 'కన్నమ్మ' పాత్రలో..?
ఇన్ని రోజులుగా మలయాళంలో సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోశియనుమ్' రీమేక్ పై ఎన్నో వార్తలు వచ్చిన సంగతి చూసాం. అయితే విజయదశమి రోజు అధికారికంగా ప్రకటించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. మాలయాళంలో బిజు మీనన్ నటించిన పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. దీనికి ‘బిల్లా రంగా’ టైటిల్ ప్రచారంలో ఉంది.
బిగ్ బాస్ 4 - కెప్టెన్ గా అరియనా హౌస్ నుండి బయటికి వెళ్లిన నోయెల్
బిగ్ బాస్ 4 - నిన్న ఎపిసోడ్ స్టార్టింగే నోయల్ అనారోగ్యంతో బాధపడటం చూపించారు. అర్ధరాత్రి దాటినా అనారోగ్యం కారణంగా నిద్ర పట్టకపోవడంతో కాస్త కన్నీరు పెట్టుకున్నాడు. ఇక పొద్దున్నే లేచిన తర్వాత అభి, నోయల్, హారిక ఒక దగ్గర కూర్చొని వుంటారు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న మోనాల్ ను చూసి మోనాల్ ఒంటెలా నడుస్తుందని అడగగా.. మరి నువ్వు దుబాయ్ షేక్‌లా కూర్చున్నావని నోయల్ అభికి కౌంటర్ ఇచ్చాడు.

పోల్ గేమ్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ బెస్ట్ మూవీ ?
వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ , ఇలియానా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "దేవదాసు "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో హీరో రామ్ , హీరోయిన్ ఇలియానా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చక్రి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

"BB3"మూవీ షూటింగ్ పునః ప్రారంభం
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ " BB3"మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అఘోరా గా ఒక పాత్ర , మరో పవర్ ఫుల్ పాత్రలో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ "సింహా ", "లెజెండ్ " మూవీస్ తరువాత బోయపాటి , బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతుంది. షూటింగ్ ఒక షెడ్యూల్ తరువాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
"నాంది "మూవీ షూటింగ్ పూర్తి
ఎస్ వి 2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రైటర్ , డైరెక్టర్ సతీష్ వేగేశ్న నిర్మాతగా నూతన దర్శకుడు విజయ్ కనక మేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ "నాంది -ఎ న్యూ బిగినింగ్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్ , నవమి , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
మాస్ లుక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
సక్సెస్ ఫుల్ "అల్లుడు శీను " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ మూవీ లో డ్యాన్స్ , ఫైట్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ ఎంటర్ టైనర్స్ "జయ జానకి నాయక ", "సాక్ష్యం " వంటి మూవీస్ తో సాయి ప్రేక్షకులను అలరించారు. సాయి హీరో గా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ "రాక్షసుడు "మూవీ ఘనవిజయం సాధించింది. సాయి ప్రస్తుతం ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు జోడీగా సాయి పల్లవి ?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ K చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. సూపర్ హిట్ మలయాళ మూవీ "అయ్యప్పనుమ్ కోషియమ్ " కు తెలుగు రీమేక్ గా రూపొందనుంది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. "గబ్బర్ సింగ్ ", సర్దార్ గబ్బర్ సింగ్" వంటి మూవీస్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
"RRR" మూవీ షూటింగ్ లో అలియాభట్ ఎంట్రీ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో లుగా మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
చిరంజీవి రెడీ ఫర్ షూటింగ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా ప్రముఖ యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.
'మిస్ ఇండియా' -'లచ్చ గుమ్మాడి' లిరికల్ సాంగ్ రిలీజ్
నరేంద్ర దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'మిస్ ఇండియా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా స్టార్ట్ చేశారు. ఇప్పటీకే టీజర్.. ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.
మహేష్ మీసం లుక్ పై నమ్రత రియాక్షన్
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వయసు పెరుగుతున్న కొద్ది ఆయన ఇంకా హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. హాలీవుడ్ హీరో లకు పోటీ ఇస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉండగా మహేష్ ను మీసంతో చూసిన సందర్భాలు చాలా తక్కువే. మ్యాగ్జిమమ్ క్లీన్ షేవ్ లోనే ఉంటాడు. అయితే ఇప్పుడిప్పుడే కొత్త లుక్‌లలో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడూ యంగ్ లుక్‌లోనే కనిపించే మహేష్ తాజాగా ఓ కమర్షియల్ యాడ్‌లో మీసకట్టుతో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
మరో ఛాలెంజింగ్ రోల్ లో నాని
హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న "టక్ జగదీష్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత సూప్ హిట్ "బ్రోచేవారెవరురా "మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక మూవీని హీరో నాని ఓకే చేశారు. వరస చిత్రాలతో హీరో నాని బిజీగా ఉన్నారు.
మిస్ కాజల్ అగర్వాల్ గా ఇంకా రెండు రోజులే
మొత్తానికి ఇంకో రెండు రోజుల్లో మిస్ టాగ్ నుండి మిస్ట్రెస్ టాగ్ కు మారిపోనుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. అభిమానులకు ఇది కొంచం బాధ కలిగించే విషయమే అయినా తన అభిమాన హీరో పెళ్లి చేసుకోడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ కిచ్లూతో అక్టోబర్ 30న అంటే మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. దీనితో ఉన్న రెండురోజుల టైం ను తన పార్టనర్ తో స్పెండ్ చేస్తుంది కాజల్. ఇక్కడ పార్ట్నర్ అంటే గౌతమ్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఆ పార్ట్నర్ చెల్లెలు నిషా అగర్వాల్.
మెగా స్టార్ చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ ?
మలయాళ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ "గీతాంజలి "మలయాళ మూవీ తో హీరోయిన్ గా మారారు. "ఇదు ఎన్న మాయం "మూవీ తో కోలీవుడ్ , "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు కీర్తి పరిచయం అయ్యారు. పలు తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. "మహానటి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.
వెబ్ సిరీస్ లో సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఫిదా " మూవీలో తెలంగాణ అమ్మాయి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాట పర్వం " మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు.
నాగశౌర్య - అనీష్ కృష్ణ సినిమా లాంచ్
యంగ్ హీరో నాగశౌర్య వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. మరో సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు. ఇటీవలే డైరెక్టర్ అనీష్ కృష్ణతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ రోజు ప్రారంభించారు. ముందుగా స్క్రిప్ట్ ను నిర్మాత నాగవంశీ చిత్రయూనిట్ సభ్యులకు అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా..కొరటాల శివ క్లాప్ కొట్టాడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించాడు.
రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ
గతకొద్ది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొనడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే పిల్లలు శివాని.. శివాత్మిక భార్య జీవిత రికవరీ అవ్వగా రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూనే వున్నారు. సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో రాజశేఖర్ మాత్రం ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో శివాని.. శివాత్మిక.. వైద్య సిబ్బంది రాజశేఖర్ హెల్త్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే వున్నారు.