డ్యాన్సర్ గా పలు తమిళ , తెలుగు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రాఘవ లారెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ మూవీస్ కు పనిచేసిన లారెన్స్ “అన్నయ్య “, “ఇంద్ర “, “స్టైల్ ” వంటి మూవీస్ కు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. “అర్పుతం “తమిళ మూవీ తో లారెన్స్ హీరోగా మారారు. సూపర్ హిట్ “ముని “మూవీ తో లారెన్స్ హీరోగా సెటిల్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మాస్”మూవీ తో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.”లక్ష్మి “హిందీ మూవీ తో కలిపి 10 మూవీస్ కు లారెన్స్ దర్శకుడిగా పనిచేశారు. లారెన్స్ హీరో , నిర్మాత, దర్శకుడిగా రూపొందిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. రాఘవ లారెన్స్ బర్త్ డే సందర్భంగా ఒక కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ అయ్యింది. 5స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై లారెన్స్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ఒక తమిళ మూవీ రూపొందనుంది. ఆ మూవీ టైటిల్ “రుద్రన్ “గా అనౌన్స్ అయింది. బర్త్ డే రోజున తన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ అయినందుకు హ్యాపీ గా ఉందనీ , మీ ఆశీర్వచనాలు కావాలని లారెన్స్ ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: