బిగ్ బాస్ 4 – 55 రోజుల జర్నీ

Bigg Boss 4 Team Gives A Glimpse Of 55 Days Of Their Journey To The House Mates

బిగ్ బాస్ సీజన్ 4- చూస్తుండగానే 55 రోజులు పూర్తయింది. ప్రస్తుతానికి హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 15 మంది స‌భ్యుల‌తో ప్రారంభ‌మైన ఈ రియాలిటీ షోకు ముగ్గురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తం 18 మంది స‌భ్యుల‌తో బిగ్ బాస్ సీజన్ 4 కొనసాగుతుంది. ఇక ఈ 55 రోజుల్లో ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. మరోవైపు నిన్న ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు 55రోజుల జర్నీ చూపించి కాస్త ఎమోషనల్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ జర్నీని హోస్ట్ నాగార్జునతో మొదలుపెట్టారు. నాగార్జున ఎంట్రీ తర్వాత హౌస్ మేట్స్ ఎంట్రీ చూపించారు. ఇక ఈ 55 రోజుల జర్నీ వీడియోలో కూడా ఈ సీజన్ లో మొదటి నుండి ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అభి, అఖిల్,మోనాల్ నే ఎక్కువ చూపించారు. ఇక నామినేషన్స్.. గేమ్స్.. హౌస్ మేట్స్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్.. వారి గొడవలు ఇలా పలు విషయాలు వీడియోలో చూపించారు. ఇక వీడియో చూసి హౌస్ మేట్స్ కాస్త ఎమోషల్ ఫీల్ అయ్యారు. అద్భుత‌మైన జ‌ర్నీని చూపించిన బిగ్ బాస్ కు హౌజ్‌మేట్స్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అఖిల్‌, అభిజిత్‌లు హ‌గ్ చేసుకొని ఫ్రెండ్స్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ అంటే గ్రూప్స్ ఉండటం కామనే. ఇక ఈ 55రోజుల్లో ఈ హౌస్ లోకూడా బాగానే గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. ముఖ్యంగా ఇద్దరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ బాండింగ్ మాత్రం బాగా సెట్ అయింది. అభి-హారిక ఫ్రెండ్ షిప్, అఖిల్-మోనాల్ ఫ్రెండ్ షిప్, అవినాష్-అరియనా ఫ్రెండ్ షిప్, మెహబూబ్-సోహైల్ ఫ్రెండ్ షిప్, దివి-అమ్మ రాజశేఖర్, నోయల్-స్వాతి దీక్షిత్ ఇలా వీరిమధ్య ఫ్రెండ్ షిప్ బాండింగ్ బాగా కుదిరింది. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడం.. కేర్ తీసుకోవడం ఎన్నో విషయాలు చూస్తూనే ఉన్నాం. మరి ముందు ముందు ఇంకా సీరియస్ టాస్క్ లు.. నామినేషన్ ప్రక్రియలు రానున్నాయి. మరి ఈ నేపథ్యంలో వీరి బాండింగ్ ఇలానే ఉంటుందా?లేదా మారుతుందా అని చూడాలి.

ఇక తొలి వారం హౌజ్ నుండి సూర్య కిర‌ణ్ ఎలిమినేట్ కాగా, త‌ర్వాత కరాటే క‌ళ్యాణి, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్, జోర్ధార్ సుజాత, కుమార్ సాయి, దివి బిగ్ బాస్ హౌజ్‌ని వీడారు. అనారోగ్యం కార‌ణంగా గంగ‌వ్వ నిష్క్ర‌మించ‌గా, నోయ‌ల్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ రోజు శ‌నివారం కావ‌డంతో ఈ రోజు ఎవరు సేఫ్ జోన్ లోకి వెళతారు.. రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే మాత్రం రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.