‘కపటధారి’ టీజర్ రీలీజ్

Actor Sumanth Latest Film Kapatadhaari Movie Teaser Is Out Now

సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ ను చేసారు చిత్ర యూనిట్. నటుడు రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఇక టీజర్ లో ఓ హత్య కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే పోలీసులతో ట్రాఫిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన సుమంత్‌ జాయిన్‌ అవుతానని అడగటం.. చివరకు కేసును ఇన్వెస్టిగేట్‌ చేస్తున్న పోలీసులు తనని ఇన్‌వాల్వ్‌ కావద్దని సుమంత్‌కు వార్నింగ్‌ ఇవ్వడంచూస్తాం. ‘వాడి అసలు మొహం దాచుకోవడానికి వేషాలు మార్చే వ్యక్తి’ అనే డైలాగ్‌తో పాటు టీజర్‌ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తున్న ‘రంగులు మార్చే లోకం.. పాచికలాడే న్యాయం.. నీతీ నియమం మరిచి.. జీవితమంటే యుద్ధం పోరాడటమే లక్ష్యం.. కన్నులు కప్పి తిరిగేవాడేరా..’’ అనే సాంగ్‌ కూడా వేషాలు మార్చే ఓ వ్యక్తి గురించి చెబుతుంది. ఇంతకూ ఆ వేషాలు మార్చే వ్యక్తి ఎవరు? అనేది మాత్రం సస్పెన్స్‌. అది ఎవరో తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.

కాగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా… నాజ‌ర్‌, నందిత‌, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళ వెర్ష‌న్‌లో ఇత‌ర న‌టీన‌టులు న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడులైన విజ‌య‌వంత‌మై అర్జున్‌, విజ‌య్ ఆంటోని `కిల్ల‌ర్‌`చిత్రంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు సంపాదించుకున్న‌సైమ‌న్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 11 =