లిటిల్ సోల్జర్స్ – క్యూటెస్ట్ ఇంట్రడక్షన్ సీన్

Checkout the best introduction scene from little soldiers movie

1996 లో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. కావ్య, బాలాదిత్య బాల నటులుగా.. కోటా శ్రీనివాస రావు, గిరిబాబు, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, సుధాకర్, హీరా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఓ క్లాసిక్ అనే చెప్పాలి. చిన్నపిల్లలు ఇప్పటికీ ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారు. మనకి ‘అమృతం’ వంటి బ్లాక్ బస్టర్ సీరియల్ ను అందించిన నిర్మాత గుణ్ణం గంగరాజు ఈ చిత్రానికి డైరెక్టర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ చిత్రంలో నటించిన బేబీ కావ్యను కూడా ఎవ్వరూ మరిచిపోలేరు. ఎంతో క్యూట్ గా.. అమాయకపు ఎక్స్ప్రెషన్లతో ప్రేక్షకులను బాగా అలరించింది. అంతేకాదు ఈ పాపకు అప్పట్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరిలో నేషనల్ అవార్డు కూడా లభించింది. ఈ పాప పూర్తిపేరు కావ్య అన్నపరెడ్డి. ఈమె నిర్మాత మరియు దర్శకుడు అయిన గుణ్ణం గంగరాజు మేనకోడలు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్ లింక్ మీకోసం. కింద లింక్ క్లిక్ చేసి.. చూసి ఎంజాయ్ చేయండి.

 

ఇక ఆ తరువాత పెద్దగా ఏ సినిమాలో కూడా కనిపించలేదు కావ్య. ఇటీవలే 2015 లో కుషాల్ అనే వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుంది. కావ్య కూడా డాక్టరే. అప్పట్లో ఈమె పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ప్రస్తుతం ఈమె విదేశాల్లో ఉంటుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.