మెగా స్టార్ అల్లుడిగా కళ్యాణ్ దేవ్ వెండి తెరకు పరిచయమైనా మామ పేరును వాడుకోకుండా తన స్వయంకృషితో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. సినిమా జయాపజయాల గురించి ఆలోచించకుండా కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే పులి వాసు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ‘సూపర్ మచ్చి’ అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా.. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్ తో వస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన పనులు పూర్తి చేసుకునే పనిలో పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. తన మూడో చిత్రంగా యంగ్ డైరెక్టర్ అశ్వద్ధామ ఫేమ్ రమణ తేజ కాంబినేషన్ లో కొత్త సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నేడు లాంఛనంగా ప్రారంభమైంది.ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలానే ఛలో, భిష్మ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన మహతి సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరగా కంప్లీట్ చేసి వీలైనంత తొందరగా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ లో వున్నారు.
Our #ProductionNo6 gets launched with a Pooja Ceremony.
Thank you @venuudugulafilm & @VenkyKudumula for gracing the event.Starring @iamkalyaandhev
Produced By @itsRamTalluri under @SRTmovies
Directed By @RamanaTeja9 pic.twitter.com/BLQyDDuSdY— SRT Entertainments (@SRTmovies) November 12, 2020
విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. అయితే మొదటి సినిమా అంత సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. అయితే కల్యాణ్ దేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరి ఈ సినిమాలు కళ్యాణ్ దేవ్ కు ఎంత వరకూ హిట్ అందిస్తాయో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: