2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా రూపొందిన “సూరరై పోట్రు “(ఆకాశం నీ హద్దురా !) తమిళ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , పరేష్ రావల్ ముఖ్య పాత్రలలో నటించారు. ఖరీదైన విమాన ప్రయాణాన్ని డెక్కన్ ఎయిర్ లైన్స్ స్థాపించి సాధారణ ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చిన జి ఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “ఆకాశం నీ హద్దురా !” మూవీ ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమ కలలను సాకారం చేసుకోవాలని పరితపించే ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి ని కలిగించేలా రూపొందిన “ఆకాశం నీ హద్దురా !”మూవీ లో హీరో సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కథ లోని భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , పరేష్ రావల్ పోటాపోటీ గా నటించారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో పాటు కన్నడ , మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ కూడా రిలీజ్ అయ్యాయి. వన్ మ్యాన్ ఆర్మీ గా రూపొందిన ఈ మూవీ కి హీరో సూర్య హైలైట్ గా నిలిచారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం ఆకట్టుకుంది. సుధ కొంగర దర్శకత్వం , సూర్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో రూపొందిన “ఆకాశం నీ హద్దురా !” మూవీ దీపావళి బ్లాక్ బస్టర్ గానిలిచింది .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: