టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా సత్యదేవ్ హీరోగా చేయకముందు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే కదా. వాటిలో ప్రభాస్ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్స్ లో ఒకరిగా సత్యదేవ్ నటించాడు. ఈ నేపథ్యంలో గతంలో తెలుగు ఫిలిం నగర్ ఛానల్ ల్లోఇంటర్వ్యూ లో పాల్గొన్న సత్యదేవ్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ చాలా బ్రిలియంట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పాడు. అంతేకాదు.. ఒకసారి పూరీ గారు మేము ఒక పార్టీలో కలిసాం.. ఆ పార్టీలో మేము మాట్లాడుకుంటుండగా ప్రభాస్ నా దగ్గరికి వచ్చి సత్య దూరంగా ఒక పెద్దావిడ డాన్స్ చేస్తుంది కదా… నువ్వు ఆవిడతో డాన్స్ చేస్తావా అని అడిగాడు.. ఎందుకు అన్నా అని నేను అడిగాను.. ఏం లేదు ఆమెకు టెర్మినల్ డిసీజ్ ఉంది.. ఆమె మనతో డాన్స్ చేయాలనుకుంటుంది.. మనిద్దరం డాన్స్ చేద్దామా అని అడిగాడు.. ఆ తర్వాత ఇద్దరం పెద్దావిడ దగ్గరకు వెళ్లి కొంచం సేపు డాన్స్ చేసాం. దానికి ఆమె చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ప్రభాస్ అన్న వచ్చి డార్లింగ్ అంటూ హగ్ చేసుకొని తను చాలా ఎంజాయ్ చేసిందని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంత మంచి వ్యక్తి అంతకంటే ఎక్కువ చెప్పలేం అంటూ ప్రభాస్ గురించి తెలియని విషయాన్ని చెప్పాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: