హీరో అజిత్ రిస్కీ బైక్ స్టంట్స్

Hero Ajith To Do Breathtaking Bike Stunts By Himself For Valimai Movie

బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ , హుమా ఖురేషి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “వాలిమై ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో కార్తికేయ నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ , చెన్నై లలో కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “వాలిమై ” మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

7నెలల తరువాత “వాలిమై ” మూవీ షూటింగ్ హైదరాబాద్ లో పునః ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం దర్శకుడు హీరో అజిత్ పై యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. బైక్ ఛేజింగ్ సన్నివేశాలలో అజిత్ డూప్ లేకుండా స్వయంగా పాల్గొంటున్నారు. హీరో అజిత్ స్వతహాగానే బైక్ రేసర్ కావడంతో రిస్కీ బైక్ స్టంట్స్ ను స్వంతంగా చేస్తున్నారు. దర్శకుడు వినోత్ , హీరో అజిత్ కాంబినేషన్ లో సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ
“పింక్ “తమిళ రీమేక్ గా రూపొందిన “నెర్కొండ పార్వై ” మూవీ ఘనవిజయం సాధించింది. “వాలిమై ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ 2021 సంవత్సరం వేసవి కి రిలీజ్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.