దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. సుమారు 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ తో హీరో యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“జంటిల్ మెన్”, “ప్రేమికుడు “, భారతీయుడు “, “జీన్స్ “, “ఒకే ఒక్కడు “, అపరిచితుడు “, శివాజీ “, “రోబో “, “2. 0” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన దర్శకుడు శంకర్ , హీరోలు యశ్ , విజయ్ సేతుపతి లతో ఒక మల్టీ స్టారర్ మూవీ ని తెరకెక్కించనున్నారని సమాచారం. హీరో యశ్ కొరకు ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను దర్శకుడు శంకర్ రెడీ చేసి ఆయనకు వినిపించినట్టు , స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి హీరో యశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో “ఇండియన్ 2 ” మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: