18 ఇయ‌ర్స్ – స‌క్సెస్‌ఫుల్ జ‌ర్నీ

Rebel Star Prabhas Completes 18 Years In Tollywood

కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ ప్రతి సినిమాకు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ప్యాన్‌ ఇండియా హీరోగా వరుస సినిమాలను చేస్తూ తెలుగు సినిమా మార్కెట్‌ రేంజ్‌ను ప్యాన్‌ ఇండియా రేంజ్‌కు మారుస్తున్న తిరుగులేని స్టార్‌. హీరోగా ఈశ్వర్‌ సినిమాతో ఆయన కెరీర్‌ స్టార్‌ అయ్యింది. ఓ టాలీవుడ్‌ హీరోపై ఎంటైర్‌ ఇండియన్‌ సినిమాలో వెయ్యికోట్ల రూపాయల పెట్టుబడుతో మూడు భారీ ప్రాజెక్టులు రూపొందుతున్నాయంటే, ప్రభాస్‌ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రభాస్‌ హీరోగా పరిచయమై18 సంవత్సరాలవుతుంది. తను నటించిన ఈశ్వర్‌ 2002, నవంబర్‌ 11న సినిమా విడుదలైంది. తొలి చిత్రంతో హీరోగా ప్రూవ్‌ చేసుకున్నారు. నేటితో ఈ సినిమా 18ఏళ్ళు పూర్తిచేసుకుంది. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. 2002యాక్షన్ రొమాన్స్ కామిడి ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా నటించింది. రేవతి, శివకృష్ణ, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, ఎన్.జె. బిక్షు, డా. కోట్ల హనుమంతరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించిన ఈ సినిమాకి జయంత్ సి పరాన్జి దర్శకత్వం వహించారు. నిర్మాత అశోక్ కుమార్. సంగీతం ఆర్. పి. పట్నాయక్.

ప్రస్తుతం రాధేశ్యామ్‌ చిత్రంతో ప్యాన్‌ ఇండియా లెవల్ల్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. రాధేశ్యామ్ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె ప్రభాస్‌తో జోడీ కడుతుండగా కీలక పాత్రలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తుండటం విశేషం. ఆ వెంటనే బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓంరావుత్‌ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడు పాత్రలో నటిస్తుంటే, ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిపాత్రలో నటిస్తున్నారు. ఇవి కాకుండా మరో రెండు భారీ బడ్జెట్‌ ప్యాన్‌ ఇండియా సినిమాలు డిస్కషన్స్‌ దశలో ఉన్నాయి. ఇలా ప్రతి ఏడాది ప్యాన్‌ ఇండియా సినిమాలతో అంచనాలు పెంచుతూ, ప్రేక్షకాభిమానులను అలరిస్తున్న ప్రభాస్‌ ఫ్యూచర్‌లో మరిన్ని గొప్ప ప్రాజెక్ట్స్‌తో తెలుగు సినిమా స్థాయిని పెంచాలని కోరుకుంటూ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు అభిమానులు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.