హీరో నాగశౌర్య కు జోడీగా షిర్లీ సెషియా

Shirley Setia To Pair Opposite Naga Shaurya In His Upcoming Movie

హీరో నాగశౌర్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “#NS20 “మూవీ లో నటిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక. ఈ మూవీ తో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “#NS21″మూవీ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ రెండు మూవీస్ ఏక కాలంలో తెరకెక్కుతున్నాయి. ఈ మూవీ లో రీతూ వర్మ కథానాయిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాగశౌర్య స్వంత బ్యానర్ ఇరా క్రియేషన్స్ పై నాగశౌర్య హీరోగా రూపొందనున్న రొమాంటిక్ డ్రామా “#NS22 “మూవీ పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. పై రెండు చిత్రాలు షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో కథానాయికగా షిర్లీ సెషియా ఎంపిక అయ్యారు. న్యూజిల్యాండ్ కు చెందిన షిర్లీ,  టి – సిరీస్ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొని పైజామా
పాప్ స్టార్ గా గుర్తింపు పొందారు. సింగర్ , యూట్యూబర్ , యాక్ట్రెస్ షిర్లీ “నికమ్మా ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.