రామరాజు ఛాలెంజ్ పూర్తి చేసిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్

Team RRR Accepts and Completes Green India Challenge Given By Ram Charan Tej

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులందరూ ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతున్నారు. అంతేకాదు తమ సన్నిహితులకు కూడా ఛాలెంజ్ ను విసురుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రామ్ చరణ్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటాడు. అనంతరం అలియా భట్, దర్శకుడు రాజమౌళి, తన నూతన చిత్రం RRR సినిమా చిత్ర బృందం సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ ఛాలెంజ్ ను స్వీకరించారు రాజమౌళి అండ్ ఆర్ఆర్ఆర్ టీం. ఛాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి మరియు ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ మొక్కలు నాటి ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఇక తాము మొక్కలు నాటిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. అనంతరం ఆచార్య, పుష్ప, రాధే శ్యామ్ చిత్ర టీంలకు ఈ ఛాలెంజ్ ను విసిరారు.

 

కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 3 =