సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమా అయిపోయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ట్రిప్ కు వెళ్తాడన్న సంగతి తెలిసిందే. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ వెళ్ళాల్సింది.. కానీ కరోనా వల్ల కుదర్లేదు. ఇక ఇన్నినెలలు తర్వాత ట్రిప్ కు వెళ్లారు. ప్రస్తుతం మహేష్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ ట్రిప్ కు సంబంధించి ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో ఫోటోని షేర్ చేశాడు. ఓ రెస్టారెంట్‌లో పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. `మా గ్యాంగ్‌తో డిన్నర్` అని కామెంట్ చేశాడు. నమ్రత కూడా తన ఇన్స్టాలో పలు ఫొటోలు పోస్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్‌ను అమెరికాలోనే ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ ట్రిప్, షూటింగ్ రెండు కలిసేలా ఈ టూర్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: