‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ పై రష్మిక ప్రశంసలు

Rashmika Mandanna Applauds The Team Of Middle Class Melodies

దొరసాని సినిమా తర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ చేస్తున్న రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ అనంతోజు దర్శకత్వంలో వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నెల నవంబర్ 20వ తేదీన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రయిలర్ ను నిన్ననే రిలీజ్ చేయగా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. సొంతంగా హోటల్ పెట్టుకోవాలని చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్రయిలర్ పై రష్మిక కూడా స్పందించి ప్రశంసలు కురిపించింది. `పాత్రలు, లొకేషన్స్, కథ, మేకింగ్, కష్టం.. అన్నీ జెన్యూన్‌గా అనిపించాయి. ఈ ట్రైలర్ చూసి చాలా నవ్వాను. నా ఇద్దరు స్నేహితులను ఇలా చూడటం చాలా సంతోషంగా అనిపించింది. నా మనస్ఫూర్తిగా ఈ సినిమాకు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఆనంద్, వర్ష మీ సినిమాతో ప్రేమలో పడిపోయాను. మీరు పోషించిన పాత్రలు నిజంగా చాలా బాగున్నాయి. ప్రేక్షకులు కూడా మీ సినిమాను ప్రేమిస్తారని నమ్మకంగా ఉన్నా` అంటూ రష్మిక ప్రశంసలు కురిపించింది.

 

కాగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ లో వెనిగ‌ళ్ళ ఆనంద‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =