చిరంజీవి కోలుకోవాలని లారెన్స్ స్పెషల్ పూజ

Raghava Lawrence Offers Special Pooja For Speedy Recovery Of Mega Star Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. చిరునే స్వయంగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. ఇక ఇదిలా ఉండగా చిరుకి కరోనా అని తెలిసిన వెంటనే అభిమానులు.. సినిమా సెలబ్రిటీస్ పెద్ద ఎత్తున స్పందించి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇక చిరుకు ఎంతో మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో రాఘవ లారెన్స్ కూడా ఒకడన్న సంగతి తెలిసిందే. ఇక లారెన్స్ కూడా చిరుకు కరోనా పాజిటివ్ అని తెలిసి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అంతేకాదు చిరు కోసం స్పెషల్ గా తనకి ఎంతో ఇష్టమైన రాఘవేంద్ర స్వామికి పూజలు కూడా చేయించినట్టు తెలిపాడు. అన్నయ్య త్వరగా కోలుకోవాలని పూజ చేయించాము.. కోవిడ్ నుండి అన్నయ్య త్వరగాకోలుకోవాలని కోరుకుంటున్నా అని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయింది. అయితే చిరుకు కరోనా పాజిటివ్ రావడంతో ముందు చిరు లేని పోర్షన్స్ వరకూ షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు.

కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 18 =