“ఈశ్వరుడు ” మూవీ శింబు , నిధి ల ఫస్ట్ లుక్ రిలీజ్

Actor Simbu and Nidhhi Agerwal First Look From Eswarudu Movie Is Out

మాధవ్ మీడియా బ్యానర్ పై సుశీంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు , అందాల నిధి అగర్వాల్ జంటగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన “ఈశ్వరన్ “(ఈశ్వరుడు )తమిళ మూవీ సంక్రాంతి పండగకు రిలీజ్ కానుంది. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఈ మూవీ రెండవ తమిళ మూవీ. మొదటి తమిళ మూవీ “భూమి ” రిలీజ్ కాకుండానే ఇస్మార్ట్ బ్యూటీ నిధి తన రెండవ మూవీ “ఈశ్వరన్ “తో తమిళ ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఈశ్వరన్ “మూవీ లో మెడ లో పాము ఉన్న శింబు లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు శింబు , నిధి ల ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. షూటింగ్ కంప్లీట్ అయిన చివరి రోజున హీరో శింబు 400 మంది కి వన్ గ్రామ్ గోల్డ్ , కొత్త దుస్తులను అందజేశారు. 200 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ కు దీపావళి పండగ సందర్భంగా కొత్త దుస్తులు అందజేశారు. హీరో శింబు ఉదార గుణానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.