ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 206
'దర్బార్' సెన్సార్ పూర్తి
ఆకట్టుకుంటున్న 'వలయం' టీజర్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అల వైకుంఠపురములో'
ఒకే బాటలో అల్లు అర్జున్, రవితేజ

2020.. `హ్యాట్రిక్` నామ సంవత్సరం
రాశీఖన్నా.. హ్యాట్రిక్ కొడుతుందా?
అన్నపూర్ణ స్టూడియోస్ లో `ప్రభాస్ 20`
`సరిలేరు నీకెవ్వరు` రన్ టైమ్ డిటైల్స్

"దర్బార్ " మూవీ భారీ ప్రచారం

బాలీవుడ్ లోకి 'వెంకీమామ'..?

ఒకే ఫ్రేమ్ లో పవన్-త్రివిక్రమ్ మ్యాటరేంటబ్బా..!

"వలయం" మూవీ టీజర్ విడుదల
'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ టైమ్ ఫిక్స్ చేసిన రౌడీ
యూ ట్యూబ్ ట్రెండింగ్ లో 'సరిలేరు నీకెవ్వరు'
'మా' ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా
తగ్గని 'ప్రతిరోజూ పండగే' కలెక్షన్స్
మారుతి దర్శకత్వంలో సాయి తేజ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లు గా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందు పాజిటీవ్ బజ్ ఉండగా.. మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో పాజిటివిటి ఎక్కువైంది. దాదాపుగా అన్ని థియేటర్లలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. రిలీజ్ అయి 13 రోజలు అవుతున్నా కలెక్లన్లు మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. అంతేకాదు.. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమాలు కూడా ఏవీ పెద్దగా హిట్ కాకపోవడంతో ప్రతిరోజూ పండగే సినిమాకు సంక్రాంతి వరకూ ఎలాంటి…
'దర్బార్' సెన్సార్ పూర్తి
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఎంఎస్.రాజు 'డర్టీ హరి' సినిమా - ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలా పలు సూపర్ హిట్ సినిమాలను అందించారు సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు. దర్శకుడిగా మారి తూనీగా తూనీగా, వాన చిత్రాలను తెరకెక్కించగా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆ తర్వాత సినీ పరిశ్రమకే దూరమయ్యారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్ రాజు తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు రెడీ అవుతున్నారు.
ఆకట్టుకుంటున్న 'వలయం' టీజర్
రమేశ్ కడుముల దర్శకత్వంలో లక్ష్, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా 'వలయం'. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్కప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'అల వైకుంఠపురములో' టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. లాంగ్ గ్యాప్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో ఎలాగైన సూపర్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు బన్నీ. ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇక ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా', 'ఓ మై డాడీ', బుట్ట బొమ్మ పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అల వైకుంఠపురములో'
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఫస్ట్ ప్లేస్ లో ట్రేండింగ్ అవుతూ సూపర్ హిట్ అయ్యాయి. దీనితో సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ సభ్యులు.
ఒకే బాటలో అల్లు అర్జున్, రవితేజ
2019ని `జీరో రిలీజ్ ఇయర్`గా సరిపెట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ.. 2020లో మాత్రం డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. `అల వైకుంఠపురములో`తో పాటు సుకుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాతోనూ బన్నీ ఈ ఏడాది సందడి చేయనుండగా.. `డిస్కో రాజా`, `క్రాక్` చిత్రాలతో రవితేజ పలకరించనున్నారు.

2020.. `హ్యాట్రిక్` నామ సంవత్సరం
2020లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే, వీటిలో సింహభాగం హిట్ కాంబినేషన్స్ (హీరో - డైరెక్టర్ జోడీ)కు హ్యాట్రిక్ మూవీస్ కావడం విశేషం.
రాశీఖన్నా.. హ్యాట్రిక్ కొడుతుందా?
`వెంకి మామ`, `ప్రతి రోజూ పండగే` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ను అందుకుంది రాశీఖన్నా. ఫిల్మ్ మేకర్ హారికగా `వెంకి మామ`లోనూ, టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజెల్ ఆర్ణాగా `ప్రతి రోజూ పండగే`లోనూ అటు అందం, ఇటు అభినయంతో అలరించిన రాశి.. త్వరలో `వరల్డ్ ఫేమస్ లవర్`తో కలసి పలకరించబోతోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ లో `ప్రభాస్ 20`
సరిగ్గా దశాబ్దం క్రితం `డార్లింగ్` (2010)గా పలకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు మరో ప్రేమకథా చిత్రం చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్ లో 20వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి `జాన్` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా... `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
`సరిలేరు నీకెవ్వరు` రన్ టైమ్ డిటైల్స్
`కొడుకు దిద్దిన కాపురం` (1989) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఇందులో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ కనిపించనుండగా, ప్రొఫెసర్ భారతిగా విజయశాంతి దర్శనమివ్వనున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకుడు. అనిల్ సుంకర, `దిల్` రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

"దర్బార్ " మూవీ భారీ ప్రచారం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళ మూవీ "దర్బార్ " , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానున్నాయి, రజనీకాంత్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సునీల్ శెట్టి, నివేత థామస్, ప్రతీక్ బబ్బర్, యోగిబాబు ముఖ్య పాత్రలలో నటించారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ "దర్బార్ " మూవీ ని ఎన్ వి ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు.

బాలీవుడ్ లోకి 'వెంకీమామ'..?
బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. 2019, డిసెంబర్ 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజ్ దాదాపు మూడు వారాలు అవ్వొస్తున్నా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. రూలర్, ప్రతీ రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలైనా కూడా వెంకీ మామ జోరు తగ్గలేదు. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించగా.. థమన్ సంగీతం అందించాడు.
బెల్లంకొండ సాయి బర్త్ డే పోస్టర్ రిలీజ్
"రాక్షసుడు " మూవీ సక్సెస్ తో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథల విషయంలో జాగ్రత్త తీసుకుంటూ మంచి కథలను ఎంపిక చేసుకుంటున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయిశ్రీనివాస్ హీరోగా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ #BSS8 గా రూపొందనుంది. నభా నటేష్ కథానాయిక కాగా సోను సూద్ ప్రతినాయకుడిగా నటించనున్నారు.

"పొన్నియిన్ సెల్వన్ " ఫస్ట్ లుక్ రిలీజ్
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చోళ రాజు రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా "పొన్నియిన్ సెల్వన్ " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి చారిత్రాత్మక నవల "పొన్నియిన్ సెల్వన్ " ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ లో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, కీర్తి సురేష్, అమల పాల్ , జ్యోతిక ప్రధాన తారాగణం.

ఒకే ఫ్రేమ్ లో పవన్-త్రివిక్రమ్ మ్యాటరేంటబ్బా..!
రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ పై గతకొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దిల్‌రాజు, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కూడా టాక్స్ వినిపించాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు 'పింక్' రీమేక్ అని ఎప్పుడైతే వార్త బయటకి వచ్చిందో అప్పటినుండి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తూనే వుంది.

"వలయం" మూవీ టీజర్ విడుదల
చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో పద్మావతి చదలవాడ నిర్మాణ సారథ్యం లో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై రమేష్ కడుముల దర్శకత్వంలో లక్ష్ చదలవాడ, "హిప్పీ" మూవీ ఫేమ్ దిగాంగన జంటగా మిస్టరీ థ్రిల్లర్ మూవీ "వలయం" రూపొందుతున్న విషయం తెలిసిందే. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ టైమ్ ఫిక్స్ చేసిన రౌడీ
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. నలుగురు హీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ఆసక్తికరంగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
యూ ట్యూబ్ ట్రెండింగ్ లో 'సరిలేరు నీకెవ్వరు'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
'మా' ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా
కాస్త పరిస్థితి నెమ్మదిగా వుంది కదా అనుకుంటున్నా సమయంలో 'మా' లొల్లి మరోసారి బయటకొచ్చింది. మా డైరీ ఆవిష్కరణలో ఈ రోజు చోటు చేసుకున్న సంఘటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, రాజశేఖర్ మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. చిరు మాట్లాడుతున్న సమయంలో రాజశేఖర్ మైక్ తీసుకోవడం... ఆ తర్వాత తాను మాట్లాడటం.. రాజశేఖర్ తీరు పై చిరు అసహనం వ్యక్తం చేయడం అన్నీ కొద్ది క్షణాల్లోనే జరిగిపోయాయి.