మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలా పలు సూపర్ హిట్ సినిమాలను అందించారు సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు. దర్శకుడిగా మారి తూనీగా తూనీగా, వాన చిత్రాలను తెరకెక్కించగా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆ తర్వాత సినీ పరిశ్రమకే దూరమయ్యారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్ రాజు తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు రెడీ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘డర్టీ హరి’ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11.11 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే నటీనటుల వివరాలు ప్రకటించనున్నట్లు సమాచారం.
కాగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గూడూరి శివరామకృష్ణ, గూడురు సతీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్పీజే క్రియేషన్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు ఎంఎస్ రాజు రాయడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: