‘అల వైకుంఠపురములో’ టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల

Ala Vaikunthapurramuloo Movie Title Song Promo Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ala Vaikunthapurramuloo Movie Updates,Ala Vaikunthapurramuloo Telugu Movie Latest News,Ala Vaikunthapurramuloo Songs,Ala Vaikunthapurramuloo Movie Songs,Ala Vaikunthapurramuloo Telugu Movie Songs

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. లాంగ్‌ గ్యాప్‌ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో ఎలాగైన సూపర్‌ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు బన్నీ. ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇక ఇప్పటివరకూ ‘సామజవరగమనా’, ‘రాములో రాములా’, ‘ఓ మై డాడీ’, బుట్ట బొమ్మ పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నెల 6వ తేదీన హైద్రాబాద్ లోని యూసఫ్ గూడాలో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ ను నిర్వహించనున్నారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో టైటిల్ సాంగ్ కు సంభందించి ఒక స్పెషల్ వీడియో ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియో ను నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి జనవరి 12వ రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − one =