యూ ట్యూబ్ ట్రెండింగ్ లో ‘సరిలేరు నీకెవ్వరు’

Sarileru Neekevvaru Becomes Trending On Youtube

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా అది యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన డాంగ్ డాంగ్ లిరిక‌ల్ సాంగ్‌తో పాటు విజ‌య‌శాంతి, అనీల్ రావిపూడి ఇంట‌ర్వ్యూ.. డాంగ్ డాంగ్ వీడియో సాంగ్‌లు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. దీనిలో భాగంగానే తాజాగా వ‌రుస‌గా 1,5,10 స్థానాల‌లో చిత్రానికి సంబంధించి వీడియోలు నిల‌వ‌డంతో మేక‌ర్స్ ఈ విష‌యాన్ని ఆనందంగా ప్ర‌క‌టించారు.

కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − four =