కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 205

సినిమా వార్తలు

అలీ నిర్మాణ సంస్థ 'అలీవుడ్'

'అలీవుడ్' ఇదేంటి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా హాలీవుడ్ వరకు విన్నాం కదా.. ఇదేం వుడ్ అబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... ప్రముఖ కామెడీ హీరో, హాస్యనటుడు అలీ కూడా ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరే అలీవుడ్. అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఆయన ఈ సంస్థను ఏర్పాటుచేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, ప్రొడ్యూసర్ జయచంద్ర, అలీ బ్రదర్ ఖయ్యూం, హీరో రవివర్మ ఇతర సినిమా ప్రముఖులు విచ్చేసి లోగో ఆవిష్కరించారు.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Mega Super Event Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Mega Super Event Hi
సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో మెగా ఎట్రాక్షన్

ఈ రోజున తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక ఘనమైన వేడుక జరుగుతుంటే చీఫ్ గెస్ట్ గా రావటానికి ఒక స్థాయి, స్టేచర్ ఉన్న సీనియర్ పర్సనాలిటీ దొరకటం కష్టం అయిపోయింది. ఒకప్పుడు దాసరి నారాయణరావు ఉండగా ఇలాంటి సందర్భాలలో ప్రతి ఒక్కరూ ఆయన రాకను కోరుకునేవారు. ఆయన కూడా సాధ్యమైనంత వరకూ అన్ని వేడుకలకు హాజరవుతూ శుభాకాంక్షలు, శుభాభినందనలు అందజేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సీనియర్ స్టార్స్ సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వయోభారంతో అన్ని వేడుకలకు హాజరు కాలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి మీద ప్రెజర్ పెరిగిపోతోంది. ముఖ్యంగా అత్యంత భారీ స్థాయిలో, భారీ అంచనాల మధ్య…

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సరిలేరు నీకెవ్వరు' ఫ్యాన్స్ కు పండగ - ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్

ఫ్యాన్స్ కు పండగ లాంటి గుడ్ న్యూస్ ప్రకటించింది 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర యూనిట్. పాటలు, టీజర్, పోస్టర్ లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఊపిరాడనివ్వకుండా చేశారు. ఇక ఫైనల్ గా మిగిలింది ట్రయిలర్. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్ అప్ డేట్ కూడా ఇచ్చేసారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru And Ala Vaikunthapurramuloo Release Dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru
రిలీజ్ అప్‌డేట్

జనవరి 11న సరిలేరు నీకెవ్వరు- 12న అల వైకుంఠపురంలో

కొద్దిసేపటి క్రితం వరకు ఫిల్మ్ నగర్ వర్గాలలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. "సరిలేరు నీకెవ్వరు- అల వైకుంఠపురంలో" చిత్రాలు రెండూ జనవరి 11న క్లాష్ అవుతున్నాయి అన్న వార్త నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న చొరవ సత్ ఫలితాన్ని ఇచ్చింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మంచు లక్ష్మీ కొత్త వెబ్ సిరీస్..!

బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. అంతేకాదు గత ఏడాది డిజిటల్ మీడియాలోకి కూడా అడుగుపెట్టారు. మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ లో నటించింది. వంశీ దర్శకత్వంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌లో మంచు లక్ష్మి టైటిల్ రోల్ ప్లే చేశారు. శ్రీనివాస్ అవసరాల, వేణు టిల్లు, మహేష్ విట్ట, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావ్, చిత్రం శ్రీను కీలక పాత్రలు పోషించారు. ZEE5 యాప్ ద్వారా మిసెస్ సుబ్బలక్ష్మి ఎపిసోడ్స్‌ని చూడొచ్చు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

కె.జి.ఎఫ్2 టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించ‌గా, క‌న్న‌డ‌లో 100 కోట్లు వ‌సూలు చేసింది. నిజానికి కన్నడం 100కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రేర్ ఫీట్ ను దాటి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'డిస్కో రాజా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే డేట్ లైన్ మీదకు దూసుకొస్తున్న రెండు స్టార్ ట్రైన్స్

ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ఢీ కొనడం కొత్త కాదు. సుదీర్ఘ సినీ చరిత్రలో ఇలాంటి "స్టార్ క్రాష్" చాలాసార్లు జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో భారీ తారల భారీ చిత్రాలు ఓకే డేట్ న రిలీజ్ అవ్వడం పోటాపోటీగా తలపడటంలో మంచి కాంపిటీటివ్ స్పిరిట్ కనిపించేది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'దర్బార్' డీసెంట్ గా ప్రీ రిలీజ్ బిజినెస్..!

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్‌, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెరిసిపోతున్న "మహానటి "

సూపర్ హిట్ మూవీ "నేను శైలజ " తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కీర్తి సురేష్ నటించిన "నేను లోకల్ " మూవీ ఘనవిజయం సాధించింది. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి "లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఉత్తమనటిగా జాతీయ అవార్డ్ అందుకుని టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ను పెంపొందించుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించాలని ఉంది - ప్రియమణి

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల చిత్ర నటి ప్రియమణి "పరుత్తి వీరన్ "(2006 ) మూవీ లో అద్భుతంగా నటించి ఉత్తమ నటి గా జాతీయ అవార్డ్ అందుకొన్నారు. తెలుగులో ప్రియమణి హీరోయిన్ గా నటించిన పెళ్ళైన కొత్తలో, యమదొంగ, శంభో శివ శంభో, గోలీమార్, రగడ , క్షేత్రం మూవీస్ ఘనవిజయం సాధించాయి. "మన ఊరి రామాయణం " మూవీ తరువాత ప్రియమణి తెలుగు మూవీస్ లో నటించలేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పేరు మార్పు కలిసొస్తుందా..?

కాలం కలిసిరానప్పుడు అప్పుడప్పుడు సెంటిమెంట్స్ ను నమ్ముకోకతప్పదు. అందుకే మన హీరోలు అతీతమేం కాదు. వాళ్ళు కూడా కాస్త టైం బ్యాడ్ నడుస్తున్నాప్పుడు సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటారు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న మెగా హీరో సాయి తేజ్ కూడా రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ నుండి.. సాయి తేజ్ కు మార్చుకున్నాడు. పేరు మార్చడం వల్లనో.. కథ వల్లనో చెప్పలేం కానీ మొత్తానికి 'చిత్రలహరి', వెంటనే 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో హిట్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా మరో యంగ్ హీరో కూడా పేరు మార్చుకున్నాడు. అతనెవరో కాదు రౌడీ హీరో గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్టోరీ సూపర్ గా ఉంటే మూవీ ఓకే చేస్తా - రకుల్ ప్రీత్ సింగ్

"కెరటం " మూవీతో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ , కోలీవుడ్ లకు ఎంటర్ అయ్యారు. కొన్ని తమిళ మూవీస్ లో నటించిన తరువాత రకుల్ "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ " మూవీ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. రకుల్ హీరోయిన్ గా నటించిన లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం మూవీస్ ఘనవిజయం సాధించాయి. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన "స్పైడర్ " మూవీ తరువాత రకుల్ కోలీవుడ్ లో బిజీగా మారారు. రకుల్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ మూవీ "దే దే ప్యార్ దే " ఘనవిజయం సాధించడం తో పలు బాలీవుడ్ మూవీస్ లో అవకాశాలు అందుకొంటున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'డర్టీ హరి' ఫస్ట్ లుక్ రిలీజ్

ఒకటి కాదు రెండు కాదు దాదాపు 12ఏళ్ల తరువాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు సీనియర్ నిర్మాత ఎంఎస్‌ రాజు. మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలా పలు సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎంఎస్‌ రాజు. దర్శకుడిగా మారి తూనీగా తూనీగా, వాన చిత్రాలను తెరకెక్కించగా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆ తర్వాత సినీ పరిశ్రమకే దూరమయ్యారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్‌ రాజు తాజాగా 'డర్టీ హరి' అనే సినిమాతో వస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యాక్టింగ్ నా డెస్టినీ - శృతి హాసన్

సక్సెస్ ఫుల్ "అనగనగా ఓ ధీరుడు" మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన శృతిహాసన్ నటించిన గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్ , కాటమ రాయుడు మూవీస్ ఘనవిజయం సాధించాయి. "కాటమ రాయుడు " మూవీ తరువాత టాలీవుడ్ కు దూరమైనశృతి హాసన్ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరో గా రూపొందుతున్న "క్రాక్ " మూవీ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. హీరో రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన "బలుపు " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'పొన్నియన్‌ సెల్వన్‌' ఐశ్వర్య ద్విపాత్రాభినయం..?

ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

TFN Adminవాట్సాప్
2020 Sankranthi Movies Run Time Details Is Out
సినిమా వార్తలు

2020 స‌ంక్రాంతి చిత్రాల నిడివి వివ‌రాలు

ఒక్కోసారి సినిమాల విజ‌యంలో ర‌న్ టైమ్ (చిత్ర నిడివి) కూడా కీల‌క భూమిక పోషిస్తుంటుంది. ఈ నేప‌థ్యంలో.. సంక్రాంతికి విడుద‌ల కానున్న నాలుగు క్రేజీ ప్రాజెక్టుల ర‌న్ టైమ్ కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్ టైటిల్ తో ధ‌నుష్ చిత్రం?

మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్స్... కొత్త చిత్రాల‌కు చిరునామాగా నిల‌వ‌డం ఇప్పుడు ఓ ట్రెండ్ గా మారింది. నిరుడు `ప్రాణం ఖ‌రీదు, రాక్ష‌సుడు, గ్యాంగ్ లీడ‌ర్, ఖైదీ, దొంగ‌`... ఇలా చిరు టైటిల్స్ తో ఐదు సినిమాలు వ‌చ్చాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ విజ‌య్ చిత్రానికి `మాస్ట‌ర్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. `ఖైదీ` ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ దీనికి ద‌ర్శ‌కుడు కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏప్రిల్ నుండి గోపీచంద్ - తేజ చిత్రం?

యాక్ష‌న్ హీరో గోపీచంద్ ప్ర‌స్తుతం సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `సీటీ మార్` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమాలో త‌మ‌న్నా, దిగంగ‌న సూర్య‌వంశీ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2020 వేస‌విలో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

Team TFNవాట్సాప్
సాంగ్

`అల వైకుంఠ‌పుర‌ములో`... సినిమాలో సాంగ్స్ ఆర్డ‌ర్ అదేనా?

ఇటీవ‌ల కాలంలో ఆడియో ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే... అది `అల వైకుంఠ‌పుర‌ములో` అనే చెప్పాలి. ముఖ్యంగా `సామ‌జ‌వ‌ర గ‌మ‌న‌`, `రాములో రాములా` అయితే యూ ట్యూబ్ లో వంద మిలియ‌న్ల మార్క్ ని అవ‌లీల‌గా అధిగ‌మించేశాయి. అలాగే `బుట్ట బొమ్మ‌`, `ఓ మై గాడ్ డాడీ` పాటలు కూడా యువ‌త‌రాన్ని విశేషంగా అల‌రిస్తున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్