‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా

Rajasekhar Resigns From MAA Vice President Position

కాస్త పరిస్థితి నెమ్మదిగా వుంది కదా అనుకుంటున్నా సమయంలో ‘మా’ లొల్లి మరోసారి బయటకొచ్చింది. మా డైరీ ఆవిష్కరణలో ఈ రోజు చోటు చేసుకున్న సంఘటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, రాజశేఖర్ మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. చిరు మాట్లాడుతున్న సమయంలో రాజశేఖర్ మైక్ తీసుకోవడం… ఆ తర్వాత తాను మాట్లాడటం.. రాజశేఖర్ తీరు పై చిరు అసహనం వ్యక్తం చేయడం అన్నీ కొద్ది క్షణాల్లోనే జరిగిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఉపాధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు.మా డైరీ లాంచ్ కార్యక్రమంలో జరిగిన పరిణామాల కారణంగా రాజశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి రాజశేఖర్ నిర్ణయాన్ని సినీ పెద్దలు సమర్థిస్తారా..? బుజ్జగించే ప్రయత్నం చేస్తారా? చూడాలి ఏం జరుగుతుందో.

నరేష్ మా అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత మాలో పరిస్థితి సరిగ్గా లేదు. మా ఎన్నికల్లో రాజశేఖర్ నరేష్ ప్యానల్ తరుపున పోటీ చేసి విజయం సాధించినా తరచుగా విభేదాలు వస్తూనే వున్నాయి. రాజశేఖర్ దంపతులకు, నరేష్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మరి చూద్దాం ఈ వివాదాలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 2 =