`వెంకి మామ`, `ప్రతి రోజూ పండగే` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ను అందుకుంది రాశీఖన్నా. ఫిల్మ్ మేకర్ హారికగా `వెంకి మామ`లోనూ, టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజెల్ ఆర్ణాగా `ప్రతి రోజూ పండగే`లోనూ అటు అందం, ఇటు అభినయంతో అలరించిన రాశి.. త్వరలో `వరల్డ్ ఫేమస్ లవర్`తో కలసి పలకరించబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో రాశీఖన్నా నటనకు అవకాశమున్న పాత్రలో కనిపించనుంది. అంతేకాదు.. తొలిసారిగా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది కూడా. మరి.. రెండు వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న రాశి.. అదే జోరుని కొనసాగిస్తూ `వరల్డ్ ఫేమస్ లవర్`తో హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న `వరల్డ్ ఫేమస్ లవర్` ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























