`కొడుకు దిద్దిన కాపురం` (1989) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఇందులో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ కనిపించనుండగా, ప్రొఫెసర్ భారతిగా విజయశాంతి దర్శనమివ్వనున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకుడు. అనిల్ సుంకర, `దిల్` రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయిన సంగతి తెలిసిందే. సెన్సార్ కమిటీ ఈ చిత్రానికి `యు/ఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. కాగా, వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమా నిడివి దాదాపు 167 నిమిషాలు (2 గంటల 47 నిమిషాలు) అని తెలిసింది. త్వరలోనే రన్ టైమ్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. సంక్రాంతి కానుకగా `సరిలేరు నీకెవ్వరు` థియేటర్లలో సందడి చేయనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: