కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 207

సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సరిలేరు నీకెవ్వరు'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Chiru152 Movie Shooting Begins In Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie News,Megastar Chiranjeevi 152nd Film Shooting Begins In Hyderabad
షూటింగ్ అప్‌డేట్

'చిరు152' షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో సినిమా వస్తున్న సంగ‌తి తెలిసిందే. గత ఏడాదే ఈ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గ్రాండ్ రిలీజ్ కు సిద్దమైన 'హల్ చల్'

శ్రీపతి కర్రి దర్శకత్వంలో రుద్రాక్ష్ఉత్కమ్ ,ధన్య బాలకృష్ణన్ జంటగా తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ హల్ చల్. ఈ సినిమా ద్వారా శ్రీపతి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాల తో సహా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధం గా ఉంది. రేపు జనవరి 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఈ కార్యక్రమంలో దర్శకులు క్రాంతి మాధవ్, శివ నిర్వణ, నిర్మాతలు బెక్కం వేణు గోపాల్, మల్కాపురం శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

TFN Adminవాట్సాప్
Priyamani Gives Green Signal To Asuran Remake
సినిమా వార్తలు

'అసురన్' వెంకటేష్ కు గ్రీన్ సిగ్నల్..!

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో 'అసురన్' సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా గతకొద్ది కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో వెంకీ సరసన సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో శ్రేయ వెంకీ పక్కన నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వేరే హీరోయిన్ ఆ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. వెంకటేష్ కి సతీమణిగా అసురన్ రీమేక్ లో నటించడానికి ప్రియమణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22 నుండి ఈమె ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రెండు వ‌రుస చిత్రాల్లో ప్ర‌భుత్వాధికారిగా నాగ్?

కింగ్ నాగార్జున మ‌ళ్ళీ వ‌రుస చిత్రాల‌తో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. తాజాగా `వైల్డ్ డాగ్`ని ప‌ట్టాలెక్కించిన ఈ అక్కినేని స్టార్.. త్వ‌ర‌లో హిందీ బ్లాక్ బ‌స్ట‌ర్ `రైడ్` రీమేక్ లోనూ న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ నాగ్ ప్ర‌భుత్వాధికారిగానే క‌నిపించ‌బోతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెంక‌టేష్ `శ‌త్రువు` @ 30 వ‌సంతాలు

విక్ట‌రీ వెంక‌టేష్‌, స్టార్ డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో `శ‌త్రువు` ఒక‌టి. ఈ సినిమాతోనే సుమంత్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అధినేత ఎం.ఎస్. రాజు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే సంచ‌ల‌న విజ‌యం అందుకున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలో వెంకీకి జోడీగా లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి న‌టించ‌గా.. ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ రోల్ లో కోట శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌న‌మిచ్చారు.

Team TFNవాట్సాప్
సాంగ్

ఐట‌మ్ సాంగ్ లో మెరిసిన శ్రియ‌

క‌థానాయిక‌గానే కాదు ప్ర‌త్యేక గీతాల్లోనూ అల‌రించిన వైనం అందాల తార శ్రియ సొంతం. రెండేళ్ళ క్రితం త‌న ర‌ష్య‌న్ ప్రియుణ్ణి ర‌హస్యంగా మ‌నువాడిన ఈ ఉత్త‌రాది సోయ‌గం.. ఇప్పుడిప్పుడే మ‌ళ్ళీ సినిమాల‌పై దృష్టి పెడుతోంది. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో `య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు`లో అతిథి పాత్ర‌లో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఓ హిందీ చిత్రం కోసం క‌నువిందు చేయ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ‌స్ట్ టైమ్ రీమేక్ చేస్తున్న టాలీవుడ్ డైరెక్ట‌ర్స్

2020లో ప‌లువురు ద‌ర్శ‌కులు `ఫ‌స్ట్ టైమ్` రీమేక్ ఎటెంప్ట్ చేస్తున్నారు. వీరిలో సీనియ‌ర్ డైరెక్ట‌ర్స్ తో పాటు యువ ద‌ర్శ‌కులు కూడా ఉండ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`జై చిరంజీవ‌!` త‌ర‌హాలో `చిరు 152` ఫ‌స్టాఫ్?

మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `చంట‌బ్బాయ్`, `దొంగ మొగుడు`, `జేబు దొంగ‌`, `రౌడీ అల్లుడు`, `జై చిరంజీవ‌!`.. ఇలా ప‌లు చిత్రాల్లో త‌న‌ హాస్యాభిన‌యంతో గిలిగింత‌లు పెట్టారు చిరు. క‌ట్ చేస్తే.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ లోనూ మ‌రోమారు త‌న కామెడీ టైమింగ్ తో ఎంట‌ర్ టైన్ చేయ‌నున్నార‌ట మెగాస్టార్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మా' డైరీ ఆవిష్కరణ చిరు, రాజశేఖర్ మధ్య మళ్లీ వివాదం

మెగాస్టార్ చిరంజీవి.. రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ గత కొద్ది కాలంగా నడుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య వున్నా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇండస్ట్రీలోని పలువురు పెద్దల సమక్షంలో పార్క్ హయత్ హోటల్‌లో 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.మా డైరీ ని మెగా స్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతుండగా... రాజశేఖర్ పదే పదే అడ్డుపడటమే కాకుండా... ఆయన నుంచి మైకు కూడా లాక్కొన్నాడు. దీనితో అక్కడ ఉన్న వారందరూ ఆశ్యర్యానికి గురికాగా.. మైక్ తీసుకున్న రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తమను తొక్కేస్తున్నారంటూ బాధను వ్యక్తం చేశాడు. మా అసోసియేషన్ వల్ల తన…

TFN Adminవాట్సాప్
RRR Heroine Olivia Morris Greets New Year Wishes On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Actress,RRR Telugu Movie Heroines
సినిమా వార్తలు

" RRR" మూవీ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ట్వీట్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "RRR" మూవీ జులై 30 వ తేదీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, థియేటర్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్

పలు మూవీస్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త బిజినెస్ లో అడుగుపెట్టారు. ఇప్పటికే దుస్తుల బిజినెస్ , ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన విజయ్ ఇప్పుడు మల్టీ ప్లెక్స్ థియేటర్ బిజినెస్ ప్రారంభించారు. టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ తో కలసి విజయ్ మెహబూబ్ నగర్ లో AVD సినిమాస్ పేరుతో 3స్క్రీన్స్ మల్టీ ప్లెక్స్ నిర్మిస్తున్నారు. తరువాత హైదరాబాద్ తో పాటు పలు ఏరియా లలో మల్టీ ప్లెక్స్ బిజినెస్ ప్రారంభిస్తారని సమాచారం.

Team TFNవాట్సాప్
Disco Raja Movie Team Releases Ravi Teja Massy Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Disco Raja Movie Updates,Disco Raja Telugu Movie Latest News,Ravi Teja Mass Look From Disco Raja Movie,Mass M
సినిమా వార్తలు

"డిస్కో రాజా "రవితేజ మాస్ లుక్

ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "ఎక్కడికి పోతావు చిన్నవాడా " మూవీ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "డిస్కో రాజా " మూవీ జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా కథానాయికలు. బాబీ సింహ ప్రతినాయకుడిగా నటించగా అజయ్, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
Ravi Teja Krack First Look Poster Is Out
ఫస్ట్ లుక్

రవితేజ 'క్రాక్' ఫస్ట్ లుక్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. డాన్ శ్రీను, బలుపు తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. కొత్త సంవత్సరం సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో గోళీసోడా చేతులో పట్టుకొని ఉన్న పోలీస్ గా కనిపిస్తున్నాడు రవితేజ. రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పోషిస్తున్నట్టు అర్ధమవుతుంది ఈ పోస్టర్ చూస్తుంటే.

TFN Adminవాట్సాప్
Mahesh Babu – Allu Arjun Release Their Movies On Their Lucky Dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Ala Vaikunthapu
సినిమా వార్తలు

మ‌హేష్, బ‌న్నీ... ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా?

ఈ సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. అయితే, వాటిలో అంద‌రి దృష్టిని విశేషంగా ఆక‌ర్షిస్తున్న‌వి మాత్రం మ‌హేష్ బాబు `స‌రిలేరు నీకెవ్వ‌రు`, అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాలు అనే చెప్పాలి. భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ రెండు సినిమాల‌పైనా... అభిమానుల్లో, స‌గ‌టు ప్రేక్ష‌కుల్లో, ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలున్నాయి.

Team TFNవాట్సాప్
Regina Cassandra Shakes A Leg With Megastar In Chiru 152,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Chiranjeevi Latest News, Chiranjeevi New Movie News, Chiru152 Movie Shooting Begins In Hyderabad, Latest
సినిమా వార్తలు

`చిరు 152`లో రెజీనా?

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి మ‌ణిశ‌ర్మ బాణీలు అందిస్తున్నాడు. చిరుకి జోడీగా త్రిష న‌టిస్తున్న ఈ సినిమాలో మ‌రో క‌థానాయిక కూడా సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Gopi Sundar Entertains Audience With Back To Back Movies In 2020
సినిమా వార్తలు

గోపీసుంద‌ర్... 2020 ఫ‌స్టాఫ్ స్పెష‌ల్

`మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు`(2015)తో తెలుగునాట సంగీత ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేసిన మాలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న్ గోపీసుంద‌ర్... అన‌తికాలంలోనే టాలీవుడ్ లోనూ త‌న‌దైన ముద్ర వేశాడు. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో ఇక్క‌డ కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎదిగాడు. అయితే, గ‌త ఏడాది మొత్త‌మ్మీద బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `మ‌జిలీ`కి మాత్ర‌మే బాణీలు అందించిన గోపి... ఈ ఏడాది మాత్రం వ‌రుస చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
Lokesh Kanagaraj Takes Chiru Movie Title For His Next Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Lokesh Kanagaraj Latest News,Director Lokesh Kanagaraj New Movie News,Lokesh Kanagaraj Next Film Updat
సినిమా వార్తలు

ఈ సారి చిరు టైటిల్ పై డైరెక్ట‌ర్ టార్గెట్

గ‌త ఏడాది మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్స్ తో ఐదు కొత్త చిత్రాలు సంద‌డి చేశాయి. అయితే, వాటిలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌చిన చిత్రం మాత్రం `ఖైదీ` అనే చెప్పాలి. అల‌నాటి `ఖైదీ` (1983) చిరు కెరీర్ ని మేలిమ‌లుపు తిప్పితే... ఈ నాటి `ఖైదీ` క‌ష్ట‌ద‌శ‌లో ఉన్న కార్తి కెరీర్ ని తిరిగి ట్రాక్ లోకి తీసుకువ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే... త‌న‌కు చిరు టైటిల్ క‌ల‌సి రావ‌డంతో వెనువెంట‌నే `దొంగ‌` టైటిల్ తో సంద‌డి చేశాడు కార్తి. అయితే, `ఖైదీ` త‌ర‌హాలో `దొంగ‌` మాత్రం మ్యాజిక్ చేయ‌లేక‌పోయింది..

Team TFNవాట్సాప్
Nagarjuna To Team Up With Garuda Vega Director Praveen Sattaru,Akkineni Nagarjuna Turns NIA Officer for His Next Project, Latest Telugu Movies News, Nagarjuna Latest Movie Details, Nagarjuna Latest News, Nagarjuna New Movie News, Nagarjuna Next Film
సినిమా వార్తలు

నాగ్ తో ప్ర‌వీణ్ స‌త్తారు?

`మ‌న్మ‌థుడు 2` త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న కింగ్ నాగార్జున‌... ప్ర‌స్తుతం `వైల్డ్ డాగ్`తో బిజీగా ఉన్నారు. `ఊపిరి` ర‌చ‌యిత అహిషోర్ సోలోమ‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 వేస‌విలో రిలీజ్ కానుంది. కాగా ఈ లోపే నాగ్ మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు.

Team TFNవాట్సాప్

షేర్