‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ టైమ్ ఫిక్స్ చేసిన రౌడీ

Vijay Deverakonda Unveils World Famous Lover Teaser Release Date and Time,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,World Famous Lover Movie Updates,World Famous Lover Telugu Movie Latest News,World Famous Lover Movie Teaser Release Date Locked,World Famous Lover Telugu Movie Teaser Release Date Confirmed

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. నలుగురు హీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు కూడా ఆసక్తికరంగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్ర టీజర్‌ ను న్యూఇయర్‌ కానుకగా రేపు(శుక్రవారం) రిలీజ్‌ చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువరించింది.

కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇజబెల్లె నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్రవరి 14న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ నాలుగు షేడ్స్ లో కనిపించనున్నాడట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 3 =