ఒకే ఫ్రేమ్ లో పవన్-త్రివిక్రమ్ మ్యాటరేంటబ్బా..!

Director Trivikram Meets Pawan Kalyan In Vijayawada,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Why Trivikram Srinivas Meets Pawan Kalyan In Vijayawada,Pawan Kalyan Latest News,Director Trivikram Srinivas Latest News

రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ పై గతకొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దిల్‌రాజు, బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కూడా టాక్స్ వినిపించాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ‘పింక్’ రీమేక్ అని ఎప్పుడైతే వార్త బయటకి వచ్చిందో అప్పటినుండి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తూనే వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తో కూడా మరో సినిమా వుండబోతున్నట్టు ప్రచారం జోరుగా సాగింది. ఇందులో ఎంత నిజముందో అని కన్ఫ్యూజన్ లో వున్న అభిమానులకు ఇప్పుడు మరో సరికొత్త డౌట్ పెట్టారు. విజయవాడకు వెళ్లిన త్రివిక్రమ్ అక్కడ పవన్ ని స్పెషల్ గా కలుసుకున్నారు. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ఒకే ఫ్రేమ్ లో దర్శనమివ్వడంతో… వీరిద్దరు ఎందుకు కలిశారబ్బా అని.. వీరి కలయికపై అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి. ఏదైనా సినిమా కోసం కలిసారా..? లేక నార్మల్ గానే కలిసారా..? అన్న సందేహాలు మొదలయ్యాయి. మరి వీరిద్దరూ ఎందుకు కలిశారు..? వీరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.