అన్న‌పూర్ణ స్టూడియోస్ లో `ప్ర‌భాస్ 20`

Prabhas 20 Movie Shooting To Begin In Annapurna Studios

స‌రిగ్గా ద‌శాబ్దం క్రితం `డార్లింగ్` (2010)గా ప‌ల‌క‌రించిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. సుదీర్ఘ విరామం త‌రువాత ఇప్పుడు మరో ప్రేమ‌క‌థా చిత్రం చేస్తున్నాడు. ప్ర‌భాస్ కెరీర్ లో 20వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి `జాన్` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. పిరియాడిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా… `జిల్` ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఇప్ప‌టికే కొంత మేర షూటింగ్ జ‌రుపుకున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్… హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ వారంలోనే ప్రారంభ‌మ‌య్యే ఈ షెడ్యూల్ లో ప్ర‌భాస్, పూజపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ని స‌మాచారం. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి ప్ర‌భాస్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా అక్టోబ‌ర్ 23న ఈ సినిమాని రిలీజ్ చేస్తార‌ని టాక్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.