2020.. `హ్యాట్రిక్` నామ సంవ‌త్స‌రం

2020 Marks Hat trick Year For A Few Interesting Combinations

2020లో ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. అయితే, వీటిలో సింహ‌భాగం హిట్ కాంబినేష‌న్స్ (హీరో – డైరెక్ట‌ర్ జోడీ)కు హ్యాట్రిక్ మూవీస్ కావ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ కాంబినేష‌న్స్ వివ‌రాల్లోకి వెళితే..

బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను: `సింహా`, `లెజెండ్`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ చిత్రాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను .. 2020లో హ్యాట్రిక్ మూవీతో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఇంకా పేరు నిర్ణ‌యించ‌ని ఈ భారీ బ‌డ్జెట్ మూవీ 2020 వేస‌వి చివ‌ర‌లో రిలీజ్ కానుంది.

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్: `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన హిట్ కాంబినేష‌న్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్.. 2020లో `అల వైకుంఠ‌పుర‌ములో`తో హ్యాట్రిక్ కి సిద్ధ‌మయ్యారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

అల్లు అర్జున్ – సుకుమార్: `ఆర్య‌`, `ఆర్య‌2` చిత్రాల‌తో అల‌రించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ జోడీ.. 2020లో హ్యాట్రిక్ మూవీతో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ.. 2020 సెకండాఫ్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని: `డాన్ శీను`, `బ‌లుపు` చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాలు చూసిన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబో… ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో `క్రాక్`తో హ్యాట్రిక్ కి సిద్ధ‌మైంది. వేస‌విలో ఈ కాప్ స్టోరీ విడుద‌ల కానుంది.

నాని – ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌: `అష్టా చ‌మ్మా`, `జెంటిల్ మ‌న్` చిత్రాల‌తో ఎంట‌ర్ టైన్ చేసిన నేచుర‌ల్ స్టార్ నాని, వైవిధ్య‌భ‌రిత చిత్రాల ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద్వ‌యం.. మార్చి 25న `వి`తో సంద‌డి చేయ‌నుంది. `వి`.. నాని కెరీర్ లో సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ కావ‌డం ఓ `వి`శేషం కాగా.. `వి` ఫ‌ర్ `విల‌న్` అన్న‌ట్లుగా ఇందులో నాని సంద‌డి చేయ‌నుండ‌డం మ‌రో విశేషం.

రామ్ – కిషోర్ తిరుమ‌ల‌: `నేను శైల‌జ, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్.. ఈ సంవ‌త్స‌రం `రెడ్`తో సంద‌డి చేయ‌నుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 9న సిల్వ‌ర్ స్క్రీన్ పైకి రానుంది.

నాగ‌శౌర్య – అవ‌స‌రాల శ్రీ‌నివాస్: `ఊహ‌లు గుస‌గుస‌లాడే`, `జ్యో అచ్యుతానంద`తో వినోదాలు పంచిన యంగ్ హీరో నాగ‌శౌర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అవ‌స‌రాల శ్రీ‌నివాస్… 2020లో `ఫ‌లానా అబ్బాయి – ఫ‌లానా అమ్మాయి`తో ప‌ల‌క‌రించ‌నున్నారు.

మొత్తంగా.. `హ్యాట్రిక్ నామ సంవ‌త్స‌రం`గా మార‌నున్న 2020లో.. ఎవ‌రెవ‌రికి ఏ స్థాయి విజ‌యాలు ద‌క్కుతాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 18 =