లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చోళ రాజు రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా “పొన్నియిన్ సెల్వన్ ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి చారిత్రాత్మక నవల “పొన్నియిన్ సెల్వన్ ” ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ లో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, కీర్తి సురేష్, అమల పాల్ , జ్యోతిక ప్రధాన తారాగణం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ కి ఆస్కార్ అవార్డ్ గ్రహీత , లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం థాయ్ ల్యాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రెండు భాగాలుగా రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ తమిళ భాష తో పాటు తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కానుందని సమాచారం.
మణిరత్నం, సుభాస్కరన్ నిర్మాతలు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































