తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళ మూవీ “దర్బార్ ” , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానున్నాయి, రజనీకాంత్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సునీల్ శెట్టి, నివేత థామస్, ప్రతీక్ బబ్బర్, యోగిబాబు ముఖ్య పాత్రలలో నటించారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ “దర్బార్ ” మూవీ ని ఎన్ వి ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“దర్బార్ ” మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. “దర్బార్ ” మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని , మూవీ పై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. “దర్బార్ ” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది. ఇప్పుడు విమానాలపై పోస్టర్స్ అతికించి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం పై ప్రేక్షకులు., అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. గతం లో రజనీకాంత్ నటించిన “కబాలి ” మూవీ కి కూడా విమానాల ద్వారా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























