కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 193

సినిమా వార్తలు

ధనుష్-సారా అలీ ఖాన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్. ఈ ఏడాది మొదట తూటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ వెంటనే ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పటాస్` తో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ లో నటించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన పటాస్ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేయను..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించి..ఆ తర్వాత చదువు నిమిత్తం కొంత గ్యాప్ తీసుకొని.. మళ్ళీ సినీ రంగంలో ప్రవేశించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ అన్న రేంజ్ కు ఎదిగాడు. ఆ హీరో ఎవరో ఇప్పటికే అర్దమయ్యేవుంటుంది కదా. ఆ హీరోనే సూపర్ స్టార్ మహేష్ బాబు. వరుస సక్సెస్‌లు ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాలిడ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

'అల వైకుంఠపురములో' పది రోజుల కలెక్షన్స్

త్రివిక్రమ్‌తో ముచ్చటగా మూడోసారి జత కట్టి అల్లు అర్జున్ ఈసారి కేరీర్ బిగ్గెస్ట్‌ హిట్ అందుకున్నాడు. మొత్తానికి లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీకి ఈ సినిమా మంచి రిలీఫె ఇచ్చింది. అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇక సినిమా రిలీజ్ అయి పదిరోజులు అవుతున్నా...కలెక్షన్స్ రాబట్టడంలో ఎలాంటి జోరు తగ్గలేదు. మరి పదిరోజుల్లో ఈ సినిమా ఏయే ఏరియాలో ఎంత రాబట్టిందో చూద్దాం..

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"జాను "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్, స్టార్ హీరోయిన్ సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "జాను " మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ తమిళ మూవీ "96" కు తెలుగు రీమేక్ గా "జాను "మూవీ రూపొందింది. గోవింద్ వసంత సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పింక్ బనారసీ శారీ లో "చందమామ "

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ఎత్నిక్ వేర్ తో కొత్త అందాలు సంతరించుకున్నారు. పింక్ బనారసీ శారీ తో, ట్రెడిషినల్ జ్యువెలరీ తో అందంగా అలంకరించుకొని శారీ క్వీన్ ఆఫ్ టాలీవుడ్ గా ప్రూవ్ చేశారు. ఎత్నిక్ వేర్ తో తన లుక్ మోడరన్ టచ్ లో ఉండేలా కాజల్ స్టైలిష్ గా కనపడతారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ కు తల్లిగా..?

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. రీసెంట్ గానే మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. గతకొద్ది కాలంగా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.ఇక ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ప్రేత్యేక సెట్‌ను నిర్మించినట్టు తెలుస్తుంది. అందులో ఓ గీతాన్ని చిత్రీకరించనున్నారట.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అమలా పాల్ తండ్రి కన్నుమూత

అమలాపాల్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి పాల్ వర్గీస్ (61) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న మరణించారు. అమల నటించిన ‘అదోఅంద పారావాయ్ పోలా’ ట్రైలర్ లాంచ్ నిమిత్తం అమల రెండు రోజుల పాటు చెన్నైలో ఉన్నారు. తన తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన స్వస్థలమైన కేరళకు వెళ్లారు.ఈరోజు మధ్యాహ్నం కురుప్పంపాడి ప్రాంతంలోని సెంట్ పీటర్ అండ్ సెంట్ పాల్ చర్చిలో అమలా తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.

TFN Adminవాట్సాప్
Ala Vaikunthapurramuloo Box Office Collections, Ala Vaikunthapurramuloo Collections, Ala Vaikunthapurramuloo Creates New Records At Box Office, Ala Vaikunthapurramuloo Movie Collections, Ala Vaikunthapurramuloo Movie Updates, Ala Vaikunthapurramuloo
బాక్సాఫీస్

"అల .. వైకుంఠపురములో .." మూవీ రికార్డ్

శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా "అల .. వైకుంఠపురములో .." మూవీ సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా దూసుకు పోతోంది.

Team TFNవాట్సాప్
Jaguar Fame Nikhil Kumar Gowda To Act In A Sports Drama
సినిమా వార్తలు

"జాగ్వార్" నిఖిల్ కుమార్ గౌడ స్పోర్ట్స్ డ్రామా

భారత మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్ కుమార్ గౌడ కన్నడ, తెలుగు భాషలలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ సూపర్ హిట్ మూవీ "జాగ్వార్" ద్వారా శాండల్ వుడ్ , టాలీవుడ్ ల కు హీరోగా పరిచయం అయ్యారు. "జాగ్వార్" మూవీ తో ప్రేక్షకులను అలరించిన నిఖిల్ గౌడ ఇప్పుడు కన్నడ, తెలుగు భాషలలో రూపొందనున్న స్పోర్ట్స్ డ్రామా తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫిబ్రవరి 17 నుండి స్టార్ట్ అంటున్న 'వరుణ్'

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Asuran remake titled Naarappa in Telugu, Asuran Telugu Remake Title And First Look Out Now, Asuran Telugu Remake Title As Naarappa, Asuran Telugu remake titled Narappa, Dhanush Asuran Telugu remake with Venkatesh Daggubati and Priyamani titled Naarap
ఫస్ట్ లుక్

'అసురన్' రీమేక్ - తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో 'అసురన్' సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను 'అనంతపురం'లో చిత్రీకరిస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ర‌జినీకాంత్ పాత్ర‌లో ధ‌నుష్... మేన‌క‌ పాత్ర‌లో కీర్తి సురేష్?

ఆ మ‌ధ్య `తొడ‌రి`(తెలుగులో `రైల్`) చిత్రంలో జంట‌గా న‌టించిన కోలీవుడ్ స్టార్ ధ‌నుష్, కేర‌ళ కుట్టి కీర్తి సురేష్.. మ‌రోసారి జ‌ట్టుకట్ట‌నున్నార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ సారి వీరి కాంబినేష‌న్ లో రానున్న సినిమా 80`ల నాటి ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి రీమేక్ అట‌. ఆ చిత్ర‌మే `నెట్రిక్క‌న్` (1981).

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాన్ - ఇండియా ప్రాజెక్ట్?

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా పాన్-ఇండియా ప్రాజెక్టుల హ‌వా సాగుతోంది. ద‌క్షిణాది సినిమాలే కాదు ఉత్త‌రాది చిత్రాలు కూడా అన్ని ప్ర‌ధాన భాష‌ల్లో రిలీజ్ అవుతూ... పాన్-ఇండియా స్టేట‌స్ తో సంద‌డి చేస్తున్నాయి. `బాహుబ‌లి` సిరీస్ తో ఈ త‌ర‌హా చిత్రాల‌కు ఊపు రాగా... తెలుగునాట `సాహో`, `సైరా` వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాలు కూడా అదే బాట ప‌ట్టాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`ఎఫ్ 2` సీక్వెల్ లో ర‌వితేజ‌?

గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `ఎఫ్ 2` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ‌రీన్ ముఖ్య పాత్ర‌ల్లో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్... బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

Team TFNవాట్సాప్
సాంగ్

`సూర‌రై పోట్రు`లో సూర్య పాట‌

కోలీవుడ్ స్టార్ సూర్య మంచి న‌టుడే కాదు.. మంచి గాయ‌కుడు కూడా. ఆరేళ్ళ క్రితం `అంజాన్` (తెలుగులో `సికింద‌ర్`) కోసం `ఏక్ దో తీన్` అంటూ సాగే పాట కోసం తొలిసారిగా గొంతు స‌వ‌రించుకున్న ఈ టాలెంటెడ్ స్టార్... రీసెంట్ గా `పార్టీ` అనే మ‌రో త‌మిళ సినిమా కోసం గానం చేశాడు. అంతేకాదు... ఎయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ జి.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా సుధ కొంగ‌ర రూపొందిస్తున్న `సూర‌రై పోట్రు` (తెలుగులో `ఆకాశ‌మే నీ హ‌ద్దు`) కోసం కూడా మ‌రోసారి సింగ‌ర్ గా అవ‌తార‌మెత్తాడు సూర్య‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`అర‌ణ్ మ‌ణై` ఫ్రాంచైజీలో రాశీఖ‌న్నా

`వెంకీమామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`... ఇలా తెలుగునాట వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది రాశీఖ‌న్నా. త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ బ్యూటీ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`తో క‌ల‌సి ప‌ల‌క‌రించ‌బోతోంది. ఇదిలా ఉంటే... త‌మిళంలోనూ క‌థానాయిక‌గా త‌న‌దైన ముద్ర వేసిన రాశి.. తాజాగా ఓ హార‌ర్ కామెడీ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందట‌.

Team TFNవాట్సాప్
Double Dhamaka For Pawan Kalyan Fans
సినిమా వార్తలు

పవన్ డబుల్ ధమాకా..!

తాము అభిమానించే హీరో ఇంక సినిమా చేయడని ఎక్కడో కాస్త నిరాశలో ఉన్న అభిమానులకు పవన్ డబుల్ ధమాకా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే పింక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి పింక్ రీమేక్ మొదలైపోయింది. నిన్నటి నుండి పింక్ రీమేక్ చిత్ర షూటింగ్ ను స్టార్ట్ చేశారు. అంతేకాదు ఈ షూటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నాడు. షూటింగ్ సెట్స్ లోని పవన్ ఫోటోకూడా ఒకటి లీక్ అయింది. ఆ ఫోటో చూస్తుంటే.. పింక్ చిత్రం కోసం తన లుక్ పెద్దగా మార్చినట్టు కనిపించట్లేదు పవన్. ఇకపోతే ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

జాను 'ప్రాణం' ఫస్ట్ సాంగ్ రిలీజ్

శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
'సవారి' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రైలర్ & టీజర్

'సవారి' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సవారి'. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. రేపు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Eega Movie Actor Kiccha Sudeep Wins Prestigious Dadasaheb Phalke Award
సినిమా వార్తలు

"మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్" సుదీప్

పలు సూపర్ హిట్ కన్నడ మూవీస్ లో నటించిన శాండల్ వుడ్ సూపర్ స్టార్ సుదీప్ టాలీవుడ్ లో "ఈగ", "సైరా "వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించారు. ప్రభుదేవా దర్శకత్వం లో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన "దబంగ్ 3" మూవీ లో సుదీప్ విలన్ గా నటించారు. ఆ మూవీ లో సుదీప్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రశంసలు పొందారు.

Team TFNవాట్సాప్

షేర్