అమలా పాల్ తండ్రి కన్నుమూత

Amala Paul Father Passes Away

అమలాపాల్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి పాల్ వర్గీస్ (61) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న మరణించారు. అమల నటించిన ‘అదోఅంద పారావాయ్ పోలా’ ట్రైలర్ లాంచ్ నిమిత్తం అమల రెండు రోజుల పాటు చెన్నైలో ఉన్నారు. తన తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన స్వస్థలమైన కేరళకు వెళ్లారు.ఈరోజు మధ్యాహ్నం కురుప్పంపాడి ప్రాంతంలోని సెంట్ పీటర్ అండ్ సెంట్ పాల్ చర్చిలో అమలా తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా తక్కువ సమయంలోనే తమిళం, తెలుగు, మలయాళ పరిశ్రమల్లో సినిమాలు చేసి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. నిజానికి అమల పాల్ సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు తండ్రి పాల్ వర్గీస్ అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో.. ఆ తర్వాత ఆమె నటిగా నిలదొక్కుకోవడంతో ఆయన కూడా ఆనందించినట్టు పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది అమల.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + eleven =