‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియన్ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. రీసెంట్ గానే మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. గతకొద్ది కాలంగా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.ఇక ఈ చిత్రం కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ప్రేత్యేక సెట్‌ను నిర్మించినట్టు తెలుస్తుంది. అందులో ఓ గీతాన్ని చిత్రీకరించనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా పెద్ద సినిమా మొదలవుతుందన్నప్పుడు రోజుకో రూమర్ వినిపించడం కూడా కామనే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా ఓ సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు.. భాగ్య శ్రీ. భాగ్య శ్రీ తెలుగులో బాలకృష్ణ రాణా(1998)సినిమాలో హీరోయిన్ గా చేసిన తరువాత టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వబోతుంది. చూద్దాం మరి ఇవి కేవలం వార్తలేనా…? నిజంగానే నటిస్తుందా..?
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా..జగపతి బాబు విలన్ గా నటించనున్నాడు. ఇందులో కృష్ణంరాజు కూడా ఓ ప్రత్యేక పాత్రలో కన్పించబోతున్నట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: