సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సవారి'. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. రేపు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
t@telugufilmnagar
The theatrical trailer of #Savaari will be out tomorrow!#SavaariOnFeb7th@ActorNandu @The_Priyanka #SrikanthReddyGanta #MothkuriSaahith #ShekarChandra #SanthoshMothkuri #NishankReddykudithi
కాగా యానిమల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంకా శ్రీకాంత్, శివ, మది నటిస్తున్నారు. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మిస్తుండగా... శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఫిబ్రవరి 7న విడుదల కానుంది.