జాను ‘ప్రాణం’ ఫస్ట్ సాంగ్ రిలీజ్

శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ఇక శర్వానంద్, సమంత మొదటిసారి జోడీ కడుతున్న ఈ మూవీ రిలీజ్ పై తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం తెలుగులో శర్వానంద్, సమంత ఏ మేరకు మెప్పిస్తారో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here