ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 192

'ఉప్పెన' రిలీజ్ డేట్ ఫిక్స్

#SSMB 27 మూవీ లో హీరోయిన్ కియారా అద్వానీ ?
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ?
టాలీవుడ్ లో దర్శకుడిగా 5సంవత్సరాలు పూర్తి

డిస్కో రాజా ఆల్ రె'ఢీ ' ఫర్ రిలీజ్
కమెడియన్ సునీల్ కి అస్వస్థత

రోజాకు బాలయ్య దిష్టిబొమ్మ..!

టాలీవుడ్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్

రజినీకాంత్ అరుదైన రికార్డ్

తక్కువ గ్యాప్ లో శ్రద్ధా కపూర్ సీక్వెల్స్

వేసవిలో థమన్ హవా

2020లోనూ వరుణ్ తేజ్ సేమ్ ఫార్ములా

`మిర్చి` తరువాత శైలి మార్చిన ప్రభాస్

`ఒరేయ్.. బుజ్జిగా` విషయంలోనూ రిపీట్ అవుతుందా?
పవన్-క్రిష్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్ డేట్
'22' సలోని మిశ్రా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ విడుదల

"సవారి" మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
'అశ్వథ్థామ' ట్రైలర్ రిలీజ్
'నర్తనశాల' సినిమాతో పరాజయంపాలైన కూడా యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో 'అశ్వథ్థామ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ కాగా.. టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'ఉప్పెన' రిలీజ్ డేట్ ఫిక్స్
సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు నిన్ననే ప్రకటించారు. నిజానికి షూటింగ్ ప్రారంభమైన సమయంలో ఒక లుక్ ను వదిలారు. దీనితో మరి ఇప్పుడు రాబోయే ఫస్ట్ లుక్‌లో వైష్ణవ్‌ను ఎలా చూపిస్తారా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా ఇప్పుడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పేసారు.

#SSMB 27 మూవీ లో హీరోయిన్ కియారా అద్వానీ ?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను "మూవీ తో కియారా అద్వానీ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడిగా నటించిన "వినయ విధేయ రామ " మూవీ నిరాశపరిచింది. ఆ మూవీ తరువాత కియారా అద్వానీ తెలుగు లో నటించలేదు. బాలీవుడ్ లో బిజీ అయ్యారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ?
సూపర్ హిట్ "సైరా నరసింహా రెడ్డి" మూవీ తో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన దర్శకుడు సురేందర్ రెడ్డి తన తరువాత ప్రాజెక్ట్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్లాన్ చేశారు. ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ను ప్రభాస్ కు వినిపించగా ఆ స్క్రిప్ట్ పై ప్రభాస్ ఆసక్తి చూపలేదని , కొన్ని కారణాల తో ఆ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశారని సమాచారం. ప్రభాస్ ఇప్పుడు తన 20 వ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ లో దర్శకుడిగా 5సంవత్సరాలు పూర్తి
సూపర్ హిట్ మూవీ "శౌర్యం " తో డైలాగ్ రైటర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. డైలాగ్ రైటర్ గా అనిల్ రావిపూడి పనిచేసిన "కందిరీగ", "సుడిగాడు" మూవీస్ ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ "పండగ చేస్కో" మూవీ కి అనిల్ స్క్రిప్ట్ అందించారు. సక్సెస్ ఫుల్ "పటాస్" మూవీ తో అనిల్ దర్శకుడిగా మారారు. "పటాస్" మూవీ 2015 సంవత్సరం జనవరి 23 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది.

డిస్కో రాజా ఆల్ రె'ఢీ ' ఫర్ రిలీజ్
వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజకు ఈ నెల 24న విడుదల కానున్న " డిస్కో రాజా" నుంచి కం బ్యాక్ ఫిలిం అవుతుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.ఇంతవరకు తను చేయని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా చేశారు రవితేజ. తనదైన స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ తో యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేస్తూ టాప్ హీరో గా ఎదిగిన రవితేజ "డిస్కో రాజా " లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఒక విభిన్న తరహా క్యారెక్టర్ చేయటంతో అంచనాలకు ఆస్కారం ఏర్పడింది. దానికి తోడు ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం చిత్రాల ద్వారా క్యాపబుల్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న విఐ ఆనంద్ దర్శకత్వం డిస్కో రాజా మీద అంచనాలు పెరగడానికి కారణమైంది.
కమెడియన్ సునీల్ కి అస్వస్థత
కమెడియన్ సునీల్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సునీల్ కు గొంతులో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కావడంతో... గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సునీల్ కి వైద్యులు చిక్కిత్స అందిస్తున్నారు. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు.

రోజాకు బాలయ్య దిష్టిబొమ్మ..!
ఏంటబ్బా వర్మ ఇంత సైలెంట్ గా వున్నాడు అనుకునేలోపే అబ్బే అదేం లేదు అన్నట్టు మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఈసారి వర్మ ట్వీట్లకు బలైంది ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు బాలకృష్ణ. గతంలో మెగా ఫ్యామిలీ పై పలు కామెంట్స్ వేసి.. మెగా అభిమానులకు కోపం తెప్పించిన వర్మ.. ఈసారి బాలయ్య ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యాడు.

టాలీవుడ్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్
సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ రీసెంట్ గా సంగీతం అందించిన "వెంకీ మామ", "ప్రతి రోజూ పండగే" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. "మూవీ కి థమన్ స్వరపరిచిన సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. మాస్ మహా రాజా రవితేజ హీరోగా రూపొందిన "డిస్కో రాజా"మూవీ కి థమన్ స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "డిస్కో రాజా"మూవీ24 వ తేదీ రిలీజ్ కానుంది.

రజినీకాంత్ అరుదైన రికార్డ్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "దర్బార్" మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో సంక్రాంతి కానుక గా 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో 200కోట్ల క్లబ్ లో చేరింది."దర్బార్" మూవీతో ఏ సౌత్ ఇండియన్ స్టార్ కు లేని అరుదైన రికార్డ్ ను రజినీకాంత్ నెలకొల్పారు.

తక్కువ గ్యాప్ లో శ్రద్ధా కపూర్ సీక్వెల్స్
గత ఏడాది ఆగస్టులో విడుదలైన `సాహో`తో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో చేరువయ్యింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. కాగా, `సాహో`కి ముందు హిందీనాట శ్రద్ధ నటించిన పలు చిత్రాలు విజయఢంకా మ్రోగించినప్పటికీ... తనకి విశేష గుర్తింపుని తీసుకువచ్చింది మాత్రం `ఆషిఖీ 2` అనే చెప్పాలి. 90ల్లో వచ్చిన `ఆషిఖీ`కి టైటిల్ సీక్వెల్ గా వచ్చిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ శ్రద్ధా కపూర్ కి ఎనలేని పేరు ప్రఖ్యాతులను తీసుకువచ్చింది. ఈ సీక్వెల్ తీసుకువచ్చిన గుర్తింపుతో ఆ తరువాత `ఏబీసీడీ2`, `రాక్ ఆన్ 2` వంటి సీక్వెల్స్ లోనూ సందడి చేసింది శ్రధ్ధ.

వేసవిలో థమన్ హవా
`వెంకి మామ`, `ప్రతి రోజూ పండగే`, `అల వైకుంఠపురములో`... ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ తో `రేసు గుర్రం`లా ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచలనం థమన్. ఈ పరంపరలోనే ఈ నెల 24న తన తదుపరి చిత్రం `డిస్కో రాజా`తోనూ సందడి చేయబోతున్నాడు. సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి థమన్ బాణీలు ప్రత్యేకాకర్షణగా నిలువనున్నాయి.

2020లోనూ వరుణ్ తేజ్ సేమ్ ఫార్ములా
రాసి కన్నా వాసికే అధిక ప్రాధాన్యమిచ్చే యువ కథానాయకుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. `ముకుంద`(2014)తో హీరోగా తొలి అడుగేసిన వరుణ్.. ఇప్పటివరకు తొమ్మిది చిత్రాలతో పలకరించాడు. వీటిలో ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించాయి. అంతేకాదు... 2017 నుంచి ఏడాదికి రెండు చిత్రాల చొప్పున విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు వరుణ్.

`మిర్చి` తరువాత శైలి మార్చిన ప్రభాస్
`ఈశ్వర్`(2002)తో కథానాయకుడిగా తొలి అడుగేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆపై చిత్రచిత్ర ప్రవర్ధమానంగా ఎదిగి.. `బాహుబలి` సిరీస్ తో నేషనల్ స్టార్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో పలకరిస్తూ వచ్చిన ప్రభాస్.. ఈ మధ్య కాస్త శైలి మార్చి రెండేళ్ళకో సినిమాతో సందడి చేస్తున్నాడు.

`ఒరేయ్.. బుజ్జిగా` విషయంలోనూ రిపీట్ అవుతుందా?
యంగ్ హీరో నితిన్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో `గుండె జారి గల్లంతయ్యిందే`(2013) ఒకటి. ఈ సినిమాతోనే దర్శకుడిగా తొలి అడుగేసిన విజయ్ కుమార్ కొండా.. మొదటి ప్రయత్నంలోనే ఘనవిజయం అందుకున్నాడు కూడా. అయితే, సెకండ్ వెంచర్ గా రిలీజైన `ఒక లైలా కోసం` (2014) మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ ఫార్మ్ చేయలేకపోయింది.
పవన్-క్రిష్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్ డేట్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. పవన్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
'22' సలోని మిశ్రా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ విడుదల
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ '22'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన హీరో ఫస్ట్‌లుక్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 22న ఈ చిత్రం…
'సరిలేరు నీకెవ్వరు` మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ - నిర్మాత అనిల్ సుంకర
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సూపర్‌స్టార్ మహేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా…
'ఉప్పెన' ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ఏప్రిల్ లో సమ్మర్ హాలిడేస్ కి సినిమాని రిలీజ్ చేయాలనీ సుకుమార్ టీమ్ ఇప్పటికే డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

"సవారి" మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, NISA నిషాంక్&సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "సవారి" మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు .