కోలీవుడ్ స్టార్ సూర్య మంచి నటుడే కాదు.. మంచి గాయకుడు కూడా. ఆరేళ్ళ క్రితం `అంజాన్` (తెలుగులో `సికిందర్`) కోసం `ఏక్ దో తీన్` అంటూ సాగే పాట కోసం తొలిసారిగా గొంతు సవరించుకున్న ఈ టాలెంటెడ్ స్టార్… రీసెంట్ గా `పార్టీ` అనే మరో తమిళ సినిమా కోసం గానం చేశాడు. అంతేకాదు… ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జి.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా సుధ కొంగర రూపొందిస్తున్న `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశమే నీ హద్దు`) కోసం కూడా మరోసారి సింగర్ గా అవతారమెత్తాడు సూర్య.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
జీవీ ప్రకాష్ సంగీతసారథ్యంలో రూపొందిన `ఇప్పవందు మోదుడా` అంటూ సాగే ఈ గీతాన్ని సూర్య ఆలపించాడు. ఈ విషయాన్ని ప్రకాష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అలాగే సూర్య పాట పాడుతున్నట్లున్న స్టిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
[custom_ad]
కాగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న `సూరరై పోట్రు` ఏప్రిల్ 9న రిలీజ్ కానుందని కోలీవుడ్ టాక్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: