‘అసురన్’ రీమేక్ – తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

Asuran remake titled Naarappa in Telugu, Asuran Telugu Remake Title And First Look Out Now, Asuran Telugu Remake Title As Naarappa, Asuran Telugu remake titled Narappa, Dhanush Asuran Telugu remake with Venkatesh Daggubati and Priyamani titled Naarappa, Latest Telugu Movies News, Naarappa Movie Updates, Naarappa Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Title And First Look of #VictoryVenkatesh74, Tollywood Movie Updates, Venkatesh Asuran Remake Naarappa First look revealed

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘అసురన్’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ‘అనంతపురం’లో చిత్రీకరిస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

తాజాగా ఈసినిమా నుండి సర్ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చాడు చిత్రయూనిట్. ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రెండు మూడు రోజుల నుండి ఈ సినిమా టైటిల్ ‘నారప్ప’ గా ఫిక్స్ చేశారని వార్తలు వింటూనే ఉన్నాం. ఇక ఈ వార్తలనే నిజం చేస్తూ ‘నారప్ప’ అనే టైటిల్ నే ఖరారు చేశారు. ఇక వెంకటేష్ లుక్ అయితే ఓ రేంజ్ లో వుంది. వెంకటేష్ తలపాగా, పంచె కట్టులో
వెంకటేష్ కళ్ళు, గడ్డంని హైలైట్ చేసేలా ఒక పోస్టర్, కత్తి పట్టుకుని నడచివస్తున్న మరో పోస్టర్, దీనంగా ఆకాశం వంక చూస్తున్న పోస్టర్స్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మరి లుక్ అయితే బావుంది.. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందో?లేదో? చూద్దాం..

[custom_ad]

కాగా ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =