బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేయను..!

Latest Telugu Movies News, Mahesh Babu about Bollywood & Hollywood Movies, Mahesh Babu About Bollywood And Hollywood Movies, Mahesh Babu Comments On Entry In Bollywood And Hollywood, Mahesh Babu New Movie News, Mahesh Babu Next Film Updates, Superstar Mahesh Babu Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించి..ఆ తర్వాత చదువు నిమిత్తం కొంత గ్యాప్ తీసుకొని.. మళ్ళీ సినీ రంగంలో ప్రవేశించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ అన్న రేంజ్ కు ఎదిగాడు. ఆ హీరో ఎవరో ఇప్పటికే అర్దమయ్యేవుంటుంది కదా. ఆ హీరోనే సూపర్ స్టార్ మహేష్ బాబు. వరుస సక్సెస్‌లు ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాలిడ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక ఇదిలా ఉండగా మొదటినుండి మహేష్ బాబు వేరే భాషల్లో సినిమాలు చేయనని చెప్తున్న సంగతి తెలిసిందే. మరోసారి అదే విషయాన్ని తెలిపారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో కూడా కొంచం స్టోరీ వున్న సంగతి విదితమే. దీనిలో భాగంగానే.. మహేష్ ‘నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడెమీ’ లోని జవాన్లతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో అక్కడ వారితో మాట్లాడిన మహేష్.. వంద ఏళ్ళైనా తాను తెలుగు సినిమాలే చేస్తానని.. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేయనని తెలిపాడు. మరి ఈ స్టేట్మెంట్ తో నిజంగానే సూపర్ స్టార్ అనిపించుకున్నాడు మహేష్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + eighteen =