
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 190


సెప్టెంబర్ లో అల్లు అర్జున్ - సుకుమార్ ఫిల్మ్?
`బాహుబలి - ది కంక్లూజన్` తేదికి `ప్రభాస్ 20`?

రెండు దశాబ్దాల మాస్ మహారాజా ప్రస్థానం

"రియల్ సూపర్ స్టార్ "
వంశీ-మహేష్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్ డేట్

రెండు బుక్స్ తో లైఫ్ స్టైల్ మారిపోయింది - తమన్నా

ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కంగనా రనౌత్

మ్యూజిక్ సిట్టింగ్స్ లో "బంగార్రాజు"

కార్తికేయ2 లో హీరోయిన్ గా..?

2021 సంక్రాంతికి పలు క్రేజీ ప్రాజెక్ట్స్

ఆ పరంపరని కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి

మరో పవర్ ఫుల్ రోల్ లో బాలకృష్ణ?

ఇద్దరు నాయికలతో మహేష్ బాబు చిత్రం?

`నారప్ప`కి రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
తమిళ్ బ్లాక్ బస్టర్ `అసురన్`... తెలుగులో `నారప్ప` పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకీకి జోడీగా ప్రియమణి నటిస్తున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. మాతృకని నిర్మించిన కలైపులి ఎస్.థానుతో కలసి డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

"V" మూవీ లో సుధీర్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో హీరోలు నాని, సుధీర్ బాబు లు ప్రధాన పాత్రలలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ "V" రూపొందుతున్న విషయం తెలిసిందే. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు. జగపతి బాబు, వెన్నెల కిషోర్, నాజర్, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

సెప్టెంబర్ లో అల్లు అర్జున్ - సుకుమార్ ఫిల్మ్?
`ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బన్నీకి జోడీగా రష్మికా మందన్న నటిస్తోంది. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.

`అయినను పోయిరావలె హస్తినకు` అంటున్న త్రివిక్రమ్?
`అల వైకుంఠపురములో` రూపంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కాగా, ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నాడీ టాలెంటెడ్ డైరెక్టర్. జూలై నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో తారక్ కి జోడీగా రష్మికా మందన్న నాయికగా నటిస్తుందని.. ఈ సినిమాకి `అయినను పోయిరావలె హస్తినకు` అనే టైటిల్ ఖరారయిందని వినిపిస్తోంది. అలాగే హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 సంక్రాంతికి రిలీజ్ కానుందని సమాచారం.
`బాహుబలి - ది కంక్లూజన్` తేదికి `ప్రభాస్ 20`?
పాన్ - ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం 2021 వేసవిలో రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల కానున్న ఈ అఖిల భారత చిత్రం (పాన్ - ఇండియా ఫిల్మ్)కి రిలీజ్ డేట్ లాక్ అయిందని టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన `బాహుబలి - ది కంక్లూజన్`(2017) విడుదలైన ఏప్రిల్ 28న `ప్రభాస్ 20` థియేటర్లలో సందడి చేయనుందని తెలిసింది. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రెండు దశాబ్దాల మాస్ మహారాజా ప్రస్థానం
సినిమా రంగంలో అవకాశాల కోసం కొన్ని కోట్ల మంది పోటీ పడితే ఎవరో కొద్దిమందిని మాత్రమే అక్కున చేర్చుకుంటుంది సినిమా. ప్రయత్నించిన వారందరికీ అవకాశాలు దొరికితే ప్రపంచమంతా సినిమా మయమే అవుతుంది. " ఒక్క చాన్స్ ప్లీజ్" అంటూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే వేలాది మంది యువకుల్లో అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం.

"రియల్ సూపర్ స్టార్ "
బాలనటుడు గా టాలీవుడ్ లో ప్రవేశించిన మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ "రాజకుమారుడు" తో హీరోగా మారారు. మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగారు.
వంశీ-మహేష్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్ డేట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఈ సంక్రాంతికి రిలీజయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ మళ్ళీ వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మహేష్ కూడా హాలీడే ట్రిప్ వున్నాడు. మూడు నెలలు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మే నుండి ఈ సినిమాను ప్రారంభించనున్నారు.

గోపీచంద్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
సంపత్ నంది దర్శకత్వం లో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ నుకూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. జనవరి 27వ తేదీన ఉదయం 8.47 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.

టాలీవుడ్ కి లక్కీ ఇయర్ గా '2020' స్టార్ హీరోలందరూ ఈ ఏడాదే
గత ఏడాది తెలుగు సినీపరిశ్రమకు కాస్త కలిసిరాలేదనే చెప్పాలి. ఏడాది ప్రారంభమే కాస్త నిరాశ పరిచింది. 2019 పొంగల్ కు పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగినా... ఒక్క ఎఫ్2 మినహా ఏ సినిమాలు పెద్దగా ఆడలేదు. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఆ తర్వాత సమ్మర్ లో.. ద్వితియార్థంలో, ఏడాది చివరిలో వచ్చిన సినిమాల్లో కూడా చాలా తక్కువ సినిమాలే హిట్ లను సొంతం చేసుకున్నాయి. కాకపోతే కొంతమంది హీరోలకు మాత్రం మంచి కమ్ బ్యాక్ ఇయర్ అయిందని చెప్పొచ్చు.

రెండు బుక్స్ తో లైఫ్ స్టైల్ మారిపోయింది - తమన్నా
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా 2019 సంవత్సరంలో రెండు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "F 2" మూవీ లో చిలిపిగా, "సైరా నరసింహా రెడ్డి" మూవీ లో త్యాగశీలిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కంగనా రనౌత్
వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకొని నటిస్తూ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన "మణికర్ణిక" మూవీ తో తన సత్తా చాటిన కంగనా రనౌత్ కబడ్డీ క్రీడాకారిణిగా నటించిన "పంగా " హిందీ మూవీ జనవరి 24 వ తేదీ రిలీజ్ అయింది.కబడ్డీ క్రీడాకారిణిగాఅద్భుతంగా నటించిన కంగనా రనౌత్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నారు. తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ మూవీ "తలైవి" లో జయలలిత గా నటిస్తున్న కంగనా మరొక నాయికా ప్రాధాన్య చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మ్యూజిక్ సిట్టింగ్స్ లో "బంగార్రాజు"
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా రూపొందిన "సోగ్గాడే చిన్ని నాయనా" మూవీ 2016 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు "సోగ్గాడే చిన్ని నాయనా" మూవీ కి సీక్వెల్ "బంగార్రాజు" మూవీ రూపొందనుంది.

తెలుగు ప్రేక్షకులకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్న సిద్ధార్థ్
"బాయ్స్" మూవీ తో కోలీవుడ్, టాలీవుడ్ లకు పరిచయమైన సిద్ధార్థ్ బ్లాక్ బస్టర్ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా " మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. "బొమ్మరిల్లు ", "జబర్దస్త్", "లవ్ ఫెయిల్యూర్" వంటి హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తరువాత సిద్ధార్థ్ కోలీవుడ్ లో బిజీగా మారారు.

కార్తికేయ2 లో హీరోయిన్ గా..?
2014 లో నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ అనే సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ కార్తికేయ సినిమా సీక్వెల్ కార్తికేయ2 తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ని జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని చూస్తున్నారు చిత్రయూనిట్.

2021 సంక్రాంతికి పలు క్రేజీ ప్రాజెక్ట్స్
సంక్రాంతి అంటేనే రసవత్తరమైన చిత్రాలకు చిరునామా. ఏవో ఒకటి అరా సందర్భాలను మినహాయిస్తే... సంక్రాంతి బరిలో బిగ్ టికెట్ ఫిల్మ్స్ దే హవా. మరీ ముఖ్యంగా.. ఈ సీజన్ లో `క్లాష్ ఆఫ్ స్టార్స్` అనేది సర్వసాధారణం. ఈ ఏడాది కూడా `సరిలేరు నీకెవ్వరు`, `అల వైకుంఠపురములో` ఇలానే క్లాష్ అయ్యాయి. సీజన్ ని చక్కగా క్యాష్ చేసుకున్నాయి.

ఆ పరంపరని కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి
`పటాస్`తో దర్శకుడైన అనిల్ రావిపూడి.. అనతికాలంలోనే స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజైన `సరిలేరు నీకెవ్వరు`తో దర్శకుడిగా మరో మెట్టు ఎక్కాడు. అంతేకాదు.. అనిల్ డైరెక్ట్ చేసిన సినిమాలు.. ఆయా హీరోలకు కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్ అవుతాయన్న సెంటిమెంట్ ని కొనసాగించాడు.

మరో పవర్ ఫుల్ రోల్ లో బాలకృష్ణ?
నటసింహ బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్. అలాంటి బాలయ్య.. త్వరలో మరో శక్తిమంతమైన పాత్రను ధరించనున్నారు. కెరీర్ లో ఇప్పటివరకు పోషించని `అఘోరా` పాత్రలో దర్శనమివ్వనున్నారట ఈ నందమూరి స్టార్.

ఇద్దరు నాయికలతో మహేష్ బాబు చిత్రం?
కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం `రాజకుమారుడు` మొదలుకుని గత చిత్రం `సరిలేరు నీకెవ్వరు` వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలన్నింటిని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. అదేమిటంటే... `యువరాజు`, `టక్కరిదొంగ`, `బ్రహ్మోత్సవం` మినహాయిస్తే దాదాపు మహేష్ హీరోగా నటించిన సినిమాలన్నీ `ఏక కథానాయిక` చిత్రాలే.

పవన్ లక్కీ డేట్ వైష్ణవ్ తేజ్ కి కూడా కలిసొస్తుందా?
`ఉప్పెన`... మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు, `సుప్రీమ్` హీరో సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి చిత్రం. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్... ఏప్రిల్ 2న థియేటర్లలో సందడి చేయనుంది.