రెండు దశాబ్దాల మాస్ మహారాజా ప్రస్థానం

Latest Telugu Movies News, Mass Maharaja Ravi Teja Latest News, Ravi Teja Blockbuster Movies, Ravi teja hit movies, Ravi Teja Super Hit Movies, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Two Decades Of Mass Maharaja Ravi Teja Film Journey, Vote For Biggest Blockbuster Hit Movie Of Ravi Teja Career So Far!

సినిమా రంగంలో అవకాశాల కోసం కొన్ని కోట్ల మంది పోటీ పడితే ఎవరో కొద్దిమందిని మాత్రమే అక్కున చేర్చుకుంటుంది సినిమా. ప్రయత్నించిన వారందరికీ అవకాశాలు దొరికితే ప్రపంచమంతా సినిమా మయమే అవుతుంది. ” ఒక్క చాన్స్ ప్లీజ్” అంటూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే వేలాది మంది యువకుల్లో అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

32 ఏళ్ల క్రితం 1988లో మద్రాసు సినీ జనారణ్యంలో కాలు మోపిన రవితేజ కు హీరోగా అవకాశం రావడానికి 11 ఏళ్లు పట్టింది. అప్పటిదాకా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ అడపాదడపా చిన్న చిన్న వేషాలు వేస్తూ రెండు పడవలపై ప్రయాణం చేసిన రవితేజ 1999లో ” నీ కోసం ” చిత్రం ద్వారా హీరోగా పరిచయమై తొలి చిత్రంతోనే ప్రతిష్ఠాత్మక నంది అవార్డులలో బెస్ట్ యాక్టర్ గా జ్యూరీ అవార్డు అందుకున్నాడు. అంతకుముందు 1997లో కృష్ణవంశీ దర్శకత్వంలో నిన్నే పెళ్ళాడతా,’ సింధూరం ‘ , వైవియస్ చౌదరి దర్శకత్వంలో ‘సీతారామ రాజు ‘ వంటి చిత్రాలలో నటించినప్పటికీ రవితేజకు రావలసిన బ్రేక్ రాలేదు. అయినా అవకాశాల వేటలో అలుపెరుగని పోరాటం చేసిన రవితేజకు 2001లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ” ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ మరుసటి సంవత్సరమే వంశీ దర్శకత్వంలో వచ్చిన “ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ” , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ” ఇడియట్” చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టడంతో టాలీవుడ్ లో రవితేజ “బ్రాండ్ అండ్ ట్రెండ్” ప్రారంభమయ్యాయి.

[custom_ad]

కొత్త తరహా చిత్రాలు అందించిన దర్శకులను, రచయితలను ట్రెండ్ సెట్టర్స్ అంటారు. ట్రెండ్ సెట్టింగ్ అనే పదం ఎక్కువగా వర్తించేది దర్శక రచయితలకే. చాలా తక్కువ సందర్భాల్లో చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే “ట్రెండ్ సెట్టర్స్” అనే క్రెడిట్ దక్కుతుంది. అలా నటన పరంగా, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా  “ట్రెండ్ సెట్టర్ ” అనే అభినందనలు అందుకున్న అతి కొద్ది మంది హీరోలలో రవితేజ ఒకడు. ముఖ్యంగా ‘ఇడియట్ ‘ చిత్రం నుండి ప్రారంభమైన రవితేజ మార్క్ ఆఫ్ యాక్టింగ్ ఒకటిన్నర దశాబ్దంగా కొనసాగుతుంది. అప్పటివరకు తెలుగు తెరమీద చూడని కొత్తరకం హీరోయిజానికి, బాడీ లాంగ్వేజ్ కి తెర తీశాడు రవితేజ. సినిమా పుట్టినప్పటినుండి ఎంతో మంది హీరోలు వచ్చారు… పోయారు. ఒక్కో హీరోది ఒక్కో స్టైల్. అయితే హీరోలందరి స్టైల్స్ ను, మేనరిజమ్స్ ను, బాడీ లాంగ్వేజ్ ని యూత్ అడాప్ట్ చేసుకోరు… అనుసరించరు. చాలా కొద్ది మంది హీరోలకు మాత్రమే అడాప్టబుల్ స్టైల్ ఉంటుంది. అందరూ కమర్షియల్ స్టార్స్ లాగానే రవితేజ చేసే పాత్రలు ‘ bigger than life’ గా ఉన్నప్పటికీ అతని నటనలో, బాడీ లాంగ్వేజ్ లో ‘a dynamic boy at our next door ‘ అనే భావన కలుగుతుంది.

[custom_ad]

సూపర్ మాన్ కు కామన్ మాన్ కు మధ్యస్థమైన ఇమేజ్ తో సాగే రవితేజ పాత్రలు, నటన, బాడీ లాంగ్వేజ్ ప్రభావం నేటి యువత మీద చాలా ఉంది. అతని పాత్రల తీరు , ఆ పవర్, ఆ పొగరు,ఆ బలుపు, ఆ తిక్క తాలూకు ఇంపాక్ట్ యూత్ ను విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అన్నది నిర్వివాదాంశం. కొంతమంది యువత అతను చేసిన పాత్రల్లోని ఎనర్జీని , డైనమిజాన్ని పాజిటివ్ యాంగిల్ లో అడాప్ట్ చేసుకుంటే కొంతమంది నెగిటివ్ యాంగిల్ లో అడాప్ట్ చేసుకున్నారు. ఇడియట్ చిత్రంలో ” కమిషనర్ల కూతుర్లకు పెళ్లిళ్లు కావా..? మొగుళ్ళు రారా ? అని అడగటాన్ని ధైర్యం అనుకోవచ్చు… బలుపు అనుకోవచ్చు. ఎవరు ఎలా తీసుకుంటారు అన్నది వాళ్ల విచక్షణ మీద ఆధారపడి ఉండవచ్చు. అయితే ఆ సినిమాతో ప్రారంభమైన రవితేజ మార్క్ ఆఫ్ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, స్టైల్,  కేర్లెస్ బిహేవియర్ తాలూకూ ప్రభావం తెలుగు యువత మీద విపరీతంగా పనిచేసింది.

[custom_ad]

రవితేజ పాత్రలు, ఆయన సినిమాలు డబ్బింగ్ ద్వారా లేదా రీమేక్స్ ద్వారా అన్ని భాషల్లోకి వెళ్ళటంతో the impact of Ravi Teja spreaded all over the country అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ముఖ్యంగా ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, వెంకీ, భద్ర, విక్రమార్కుడు, దుబాయ్ శీను, కృష్ణ, నేనింతే, కిక్, ఆంజనేయులు, డాన్ శీను, మిరపకాయ, బలుపు, పవర్ తదితర చిత్రాలలో రవితేజ చేసిన పాత్రలు, వాటిల్లో తన నటన యూత్ ను ఉర్రూతలూగించింది. ఆ తరువాత వచ్చిన యంగ్ హీరోలు కూడా దాదాపు అదే ప్యాట్రన్ ఆఫ్ యాక్టింగ్ ను, బాడీ లాంగ్వేజిని ఫాలో అవ్వటం తో దాదాపు దశాబ్దంన్నరగా తెలుగు యూత్ మీద రవితేజ ఇంపాక్ట్ బలంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.

[custom_ad]

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి చిన్నచిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ హీరోగా మారిన రవితేజ ఒక జనరేషన్ ను ప్రభావితం చేసే స్థాయికి ఎదగటాన్ని అంచనాలకు మించిన అచీవ్మెంట్ గా అభినందించవచ్చు.

కెరీర్ ప్రారంభంలో హీరోల పక్కన చిన్న చిన్న పాత్రలు వేసిన రవితేజ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ గా ఎదిగి “మాస్ మహారాజా” అనే అభినందనలు అందుకోవడాన్ని ఊహలకందని కార్యసాధనగా చెప్పుకోవాలి.

ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన రవితేజ 2012 ఫోర్బ్స్ ఇండియా జాబితాలో 15.5 కోట్ల వార్షిక ఆదాయంతో 50వ స్థానాన్ని దక్కించుకోవడం రియల్లీ గ్రేట్.

[custom_ad]

నవరసాలలో ఉత్కృష్ట ము, సంక్లిష్టము అయిన హాస్య రసాన్ని చాలామంది హీరోలు పోషించినప్పటికీ రవితేజకు మాత్రమే దక్కిన ప్రత్యేక అభినందన ఒకటి ఉంది. హాస్య రస పోషణలో ఎవరి పంథా వారికి ఉన్నప్పటికీ హాస్యానికి స్టార్డమ్ తెచ్చిన వన్ అండ్ ఓన్లీ స్టార్ రవితేజ అన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.

వివాదాలకు నెలవైన చిత్ర పరిశ్రమలో తన సినిమాలు, తన పాత్రలు, తన నటన తప్ప అన్యధా ఎలాంటి వివాదాలలో తల దూర్చకుండా నాన్ కాంట్రవర్షియల్ జెంటిల్ మెన్ గా తనదైన వ్యక్తిత్వాన్ని  నిలుపుకుంటున్న రవితేజ పుట్టిన రోజు జనవరి 26. ఈ సందర్భంగా రవితేజకు జన్మదిన శుభాకాంక్షలతో పాటు జనవరి 24 న విడుదలైన ” డిస్కో రాజా” విజయాభినందనలు కూడా తెలియజేస్తుంది ‘ ద తెలుగు ఫిలిం డాట్ కాం ‘.

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + three =