`అల వైకుంఠపురములో` రూపంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కాగా, ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నాడీ టాలెంటెడ్ డైరెక్టర్. జూలై నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో తారక్ కి జోడీగా రష్మికా మందన్న నాయికగా నటిస్తుందని.. ఈ సినిమాకి `అయినను పోయిరావలె హస్తినకు` అనే టైటిల్ ఖరారయిందని వినిపిస్తోంది. అలాగే హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 సంక్రాంతికి రిలీజ్ కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
`అతడు`, `అత్తారింటికి దారేది`, `అ ఆ`, `అజ్ఞాతవాసి`, `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో`.. ఇలా `అ` సెంటిమెంట్ తో ముందుకు సాగుతున్న త్రివిక్రమ్.. రాబోయే సినిమాకీ ఆ పరంపరని కొనసాగిస్తుండడం విశేషం. త్వరలోనే తారక్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీకి సంబంధించి టైటిల్, హీరోయిన్ తదితర విషయాలపై ఫుల్ క్లారిటీ వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: