వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకొని నటిస్తూ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “మణికర్ణిక” మూవీ తో తన సత్తా చాటిన కంగనా రనౌత్ కబడ్డీ క్రీడాకారిణిగా నటించిన “పంగా ” హిందీ మూవీ జనవరి 24 వ తేదీ రిలీజ్ అయింది.కబడ్డీ క్రీడాకారిణిగాఅద్భుతంగా నటించిన కంగనా రనౌత్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నారు. తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ మూవీ “తలైవి” లో జయలలిత గా నటిస్తున్న కంగనా మరొక నాయికా ప్రాధాన్య చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
రోనీ స్క్రూ వాలా నిర్మాణ సారథ్యం లో శర్వేష్ మేవరా దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో “తేజస్ ” హిందీ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో కంగనా రనౌత్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా నటించనున్నారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ .. సైన్యం నేపథ్య మూవీస్ లో నటించాలనేది తన కోరికని, సైనికులంటే తనకెంతో గౌరవమని, దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైన్యం నేపథ్యంలో రూపొందే “తేజస్” మూవీ లో నటించడం తన అదృష్టమని, నిర్మాత, దర్శకులకు ధన్యవాదాలని, “తలైవి” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటానని కంగనా రనౌత్ తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























