నటసింహ బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్. అలాంటి బాలయ్య.. త్వరలో మరో శక్తిమంతమైన పాత్రను ధరించనున్నారు. కెరీర్ లో ఇప్పటివరకు పోషించని `అఘోరా` పాత్రలో దర్శనమివ్వనున్నారట ఈ నందమూరి స్టార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. తన లక్కీ డైరెక్టర్స్ లో ఒకరైన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. `సింహా`, `లెజెండ్` తరహాలో ఈ చిత్రంలోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి రెగ్యులర్ మాస్ క్యారెక్టర్ కాగా.. మరొకటి మాత్రం `అఘోరా` తరహా పాత్ర అని సమాచారం.
[custom_ad]
అంతేకాదు.. వారణాసి నేపథ్యంలో ఈ పాత్రకి సంబంధించిన సన్నివేశాలు వస్తాయని వినికిడి. ప్రస్తుతం ఈ పాత్ర తాలూకు దృశ్యాల కోసం లొకేషన్ల వేట సాగుతోందని.. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్. మరి.. సరికొత్త పాత్రలో బాలయ్య ఏ మేరకు మెస్మరైజ్ చేస్తారో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























